Horoscope Today: ఈ రాశి వారు ఉద్యోగాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope Today 12th June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
Horoscope Today 12th June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 12న) శనివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి.. ఈరోజు వీరు అనుకోని ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు, అవమానాలు ఎదురవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సూర్య గ్రహ ఆరాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి… ఈరోజు వీరు కొన్ని అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సాధ్యమైనంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.
మిథున రాశి.. ఈరోజు వీరికి శ్రమ పెరుగుతుంది. అలాగే గుర్తింపు కోసం కొంత తాపత్రాయ పడుతుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి..నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరికి దూర ప్రయాణాలపై కొంత ఆసక్తి ఏర్పడుతుంది. వేరు వేరు రూపాల్లో సహకారాన్ని కోరుకుంటుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం.. పేద వారికి అన్న వస్త్రాలు ధానం చేసుకోవడం మంచిది.
సింహ రాశి.. ఈరోజు వీరికి అన్ని పనుల్లో కొంత సంతృప్తిని పొందే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ధాన ధర్మాలు చేసుకోవడం వలన పుణ్య బలాలు పెంపోందించుకునే అవకాశం ఉంటుంది. భవానీ శంకర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.
కన్యరాశి.. ఈరోజు వీరు ఉద్యోగాల విషయంలో అధికారులతో వ్యవహరించే సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు బలపడుతుంటాయి. శ్రీ రాజమాతంగై నమ: అనే నామ స్మరణతోపాటు.. లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
తులారాశి.. ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పాడుతుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి వ్యాపార, వ్యవహరిక విషయాల్లో, క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్ట లక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి నూతన పరిచయాల వలన ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. దుర్గా అమ్మవారికి మందార పుష్పాలను సమర్పించుకోవడం మంచిది.
మకర రాశి.. ఈరోజు వీరికి గతంలో చేసిన అప్పుల వలన కొంత ఒత్తిళ్లు, బాధలు ఏర్పడుతుంటాయి. అయినప్పటికి శక్తి మేర వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అష్ట లక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి.. ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో అవకాశాలు వస్తుంటాయి. అది.. సినిమా, టీవీ రంగాలు కావచ్చు.. ఇతర కళా రంగాలలో కావచ్చు. అనేక ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆర్థికంగా ఒత్తిళ్లు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అష్ట లక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి.. ఈరోజు వీరు గృహ సంబంధమైన విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బందులు పడకూడదు. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నాగర నాయకి అనే నామ స్మరణ మేలు చేస్తుంది.