Horror: దారుణం.. ఏడాదిన్నర చిన్నారిపై అత్యాచారం.. చికిత్స పొందుతూ..
Girl Rape Case: పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి పొట్టనబెట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో
Girl Rape Case: పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి పొట్టనబెట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. 30 ఏళ్ల నిందితుడు ఎత్తుకెళ్లాడు. అనంతరం సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పాఠశాల భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవగానే తమ కుమార్తె కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. గ్రామస్థులతో కలిసి పాపకోసం వెతకడం ప్రారంభించారు. సమీపంలోని పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న చిన్నారి వారి కంటపడింది. అనంతరం నిందితుడిని పట్టుకొని గ్రామస్థులు చితకబాదారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి గురైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బహ్రాయిచ్ పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిన కోర్టుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో పోలీసులపై దాడి చేసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడి కాలికి గాయమైంది. ఈ క్రమంలో నిందితుడిన పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
Also Read;