Groom Beaten: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.. విషయం తెలిసి అబ్బాయిని చితకబాదిన అమ్మాయి కుటుంబసభ్యులు

ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని చితకబాదారు అమ్మాయి తరఫు బంధువులు ఈ ఘటన కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Groom Beaten: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.. విషయం తెలిసి అబ్బాయిని చితకబాదిన అమ్మాయి కుటుంబసభ్యులు
Bride Family Attacked On Groom
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 23, 2021 | 7:30 AM

Groom Beaten by Bride Family: ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని చితకబాదారు అమ్మాయి తరఫు బంధువులు ఈ ఘటన కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ జంట రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.

తిర్యాని మండలంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిర్యానీ మండల కేంద్రానికి చెందిన షేర్ల రాము అనే యువకుడు ఇర్క పెళ్లి గ్రామానికి చెందిన సమత గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, అందుకు వారు ఒప్పకోరని తెలిసి, ఆరు నెలల కిందట ఇరువురు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన కొత్త జంట వారి తల్లిదండ్రులకు పెళ్లి విషయం చెప్పకుండా వారి వారి ఇళ్లలో ఉంటున్నారు. తాజాగా పెళ్లి విషయం అమ్మాయి తరుఫు కుటుంబసభ్యులకు తెలియడంతో వారి బంధువులు అబ్బాయి ఇంటిపై దాడికి దిగారు. అనంతరం అతన్ని బయటకు తీసుకువచ్చి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అమ్మాయి కుటుంబసభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనలో అబ్బాయి తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అమ్మాయి తరఫు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also…  Psycho Attack: నిజామాబాద్ జిల్లాలో సైకో వీరంగం.. ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి.. ఒకరి పరిస్థితి విషమం