Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు.. అయినా 3 బడా చిత్రాల్లో అవకాశాలు !

ఇంట గెలిచేశాం.. ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్‌. ఇన్నాళ్లు మనం మన సినిమా అంటూ మడి కట్టుకు కూర్చున్న తమిళ సినిమా జనాలు కూడా ఇప్పుడు...

Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు.. అయినా 3 బడా చిత్రాల్లో అవకాశాలు !
Anirudh Ravichander
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 10:07 PM

ఇంట గెలిచేశాం.. ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్‌. ఇన్నాళ్లు మనం మన సినిమా అంటూ మడి కట్టుకు కూర్చున్న తమిళ సినిమా జనాలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ హీరోలు స్ట్రయిట్ తెలుగు సినిమా మీద ఖర్చీఫ్‌ వేస్తుంటే… ఇప్పుడు నా టర్న్ అంటున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌. కోలీవుడ్‌లో టాప్ చైర్ అందుకున్నా… తెలుగులో మాత్రం హవా చూపించలేకపోతున్నారు మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఈ మ్యూజిక్‌ సెన్సేషన్‌. అయితే ఫస్ట్ సినిమానే డిజాస్టర్ కావటంతో అనిరుధ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్‌ రాలేదు. అందుకే ఈ సారి బిగ్ బ్యాంగ్‌తో రావాలని ప్లాన్ చేస్తున్నారు అనిరుధ్‌ .

వరుసగా ముగ్గురు టాలీవుడ్‌ టాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట అనిరుధ్‌ . ట్రిపులార్ హీరోలు ఇద్దరు తమ నెక్ట్స్ సినిమాకు అనిరుధే ఫస్ట్ ఛాయిస్ అంటున్నారు. నెక్ట్స్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు తారక్‌. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్‌ మూవీకి అనిరుధ్‌ సంగీత దర్శకుడన్న టాక్‌ వినిపిస్తోంది. గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు కూడా అనిరుధే స్వరాలందిస్తారన్న మాట కూడా గట్టిగానే వైరల్‌ అవుతోంది. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న శంకర్‌ మూవీ ఇండియన్‌ 2కి కూడా అనిరుధే సంగీత దర్శకుడు. అందుకే రామ్‌ చరణ్ సినిమాకు కూడా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టరే ఫిక్స్ అవుతారనే గెస్‌ నడుస్తోంది.

మరో క్రేజీ మూవీకి కూడా అనిరుధ్ పేరు ఫస్ట్ లిస్ట్‌లో వినిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా అనిరుధ్ పేరు పరిశీలిస్తున్నారట. అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్‌ను టాలీవుడ్‌కు తీసుకువచ్చిన త్రివిక్రమ్.. ఫస్ట్ బ్రేక్‌ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్‌ టాక్‌. ఈ మూడు సినిమాలు అనిరుధ్‌ ఖాతాలో పడితే… టాలీవుడ్‌లోనూ టాప్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

Also Read: భవిష్యత్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాలో..! అది కూడా ఆ ఇద్దరిలో ఒకరికి సోదరిగా !

గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై