Vijay Deverakonda: డేరింగ్ స్టెప్స్.. క్రేజీ ట్వీట్స్.. రౌడీ హీరో రూటే సెపరేట్..
కొన్ని మాటలు ఏళ్ల తరబడి గుర్తుండిపోతాయి. ఇదిగో ఇప్పుడు రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ చెప్పిన మాట కూడా అలాంటిదే. కెరీర్ టర్న్ తీసుకున్న ప్రతిసారీ దేవరకొండ విజయ్ సాయి...
కొన్ని మాటలు ఏళ్ల తరబడి గుర్తుండిపోతాయి. ఇదిగో ఇప్పుడు రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ చెప్పిన మాట కూడా అలాంటిదే. కెరీర్ టర్న్ తీసుకున్న ప్రతిసారీ దేవరకొండ విజయ్ సాయి ట్వీట్‌లో ఎస్టాబ్లిష్ అయిన సెల్ప్ కాన్ఫిడెన్స్ ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు జనాలు. ఇంతకీ వీడీ ఏమన్నారు? దానికి నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఓ లుక్ వేద్దాం పదండి. అదీ… యస్… అదీ నువ్వంటే. సాలా క్రాస్ బ్రీడ్ లైగర్ అంటూ రౌడీ బోయ్‌కి ఛార్మి ఇచ్చిన కాంప్లిమెంట్ చూసి ఫిదా అవుతోంది రౌడీ ఆర్మీ. ఇదేముందబ్బా… అంతకు మించి అనే రేంజ్‌లో రౌడీ బోయ్ ప్రీవియస్‌గా చేసిన ట్వీట్ కూడా అంతే హై ఇచ్చింది అతడి అభిమానులకు. పూరి డైరక్షన్‌లో విజయ్ చేస్తున్న లైగర్‌కు 200 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందని, ఇన్‌కేస్ థర్డ్ వేవ్ వస్తే ఆ రూట్ గురించి కూడా మేకర్స్ కన్సిడర్ చేసే ఛాన్సులున్నాయని న్యూస్ వైరల్ అయింది. అయితే దీని మీదే లైగర్ బోయ్ స్ట్రాంగ్‌గా స్పందించారు. థియేటర్లలో అంతకు మించి కలెక్ట్ చేస్తాననే కాన్ఫిడెన్స్ ని ఒకే ఒక్క ట్వీట్‌తో చూపించారు.
Too little. I’ll do more in the theaters. pic.twitter.com/AOoRYwmFRw
— Vijay Deverakonda (@TheDeverakonda) June 21, 2021
యువర్ బీస్ట్ బోయ్ అంటూ రీసెంట్‌గా డబు రత్నాని ఫొటో షూట్ పిక్స్ ని షేర్ చేసిన రౌడీ హీరో ఇప్పుడు డబుల్ జోష్‌తో ఉన్నారు. అప్పుడెప్పుడో సింపుల్ అండ్ లవ్లీ గీతగోవిందంతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరగా లేనిది… ఇప్పుడు ఇంత పెద్ద ప్యాన్ ఇండియా పిక్చర్‌కి జస్ట్ 200 కోట్లేనా అనేది విజయ్ ట్వీట్‌లో కనిపిస్తున్న సిన్సియర్ ఫీలింగ్. వైడర్ రేంజ్ ఆడియన్స్ ప్లస్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని చూస్తే విజయ్ అన్న మాటలు అక్షర సత్యాలని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. విజయ్ ట్వీట్స్ మాత్రమే కాదు.. అతడి నడవడిక, నిర్ణయాలు కూడా అంతే డేరింగ్‌గా ఉంటాయి. తన మీద తాను నమ్మకం ఉంచుకోవడంలో విజయ్ దేవకొండ రూటే సెపరేటు.
Also Read: భవిష్యత్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాలో..! అది కూడా ఆ ఇద్దరిలో ఒకరికి సోదరిగా !