AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. వలకు చిక్కిన చేపను కోసి సంబరపడిపోయాడు.. ఇంతకీ ఏం దొరకిందంటే!

రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు

Viral Video: ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. వలకు చిక్కిన చేపను కోసి సంబరపడిపోయాడు.. ఇంతకీ ఏం దొరకిందంటే!
Fisherman Finds An Unopened Bottle Of Whisky Inside A Fish
Balaraju Goud
|

Updated on: Jun 23, 2021 | 8:10 AM

Share

Fisherman finds an unopened bottle: ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. కడుపు లోపల తెరవని విస్కీ బాటిల్‌ను గుర్తించిన మత్స్యకారులు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో టిక్‌టాక్ వేదికగా తెగ వైరల్‌గా మారింది.

మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దీంతో వారికి భారీ ఆకారంతో కూడి చేప చిక్కింది. దాని ఎంజాయ్ చేద్దామనుకున్న వారు బోటులోనే కోసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు చేప కడుపులో ఏదో వింత వస్తువును గమనించారు. ఆ అవయవాన్ని కత్తిరించాడు. దాన్ని చూసిన మత్స్యకారుడు సంబరపడిపోయాడు. ఆశ్చర్యం ఏమంటే, ఆ వస్తువు ఫైర్‌బాల్ విస్కీ తెరవని బాటిల్‌గా తేలింది. దీంతో చేపతో పాటు విస్కీని అస్వాదించారు మత్స్యకారులు.. ఇది ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలియదు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌తో సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నిజమేనా?.. చేపలు మొత్తం బాటిల్‌ను తినగలిగితే వినియోగదారుల పరిస్థితేంటి? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది అయితే, మత్స్యకారులు సీసాను ఆన్‌బోర్డ్‌లోకి తిప్పిన తర్వాత చేప గొంతు క్రింద తీశారంటూ కామెంట్స్ చేశారు. ఇదిలావుంటే, సముద్ర జంతువులు ప్రాణులను మింగడం, వస్తువులను మిగడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. Read Also… Groom Beaten: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.. విషయం తెలిసి అబ్బాయిని చితకబాదిన అమ్మాయి కుటుంబసభ్యులు