Covid 19 Vaccine: శ్రీకాకుళం జిల్లా పూడివలసలో విషాదం.. కోవిడ్ వ్యాక్సీన్ వల్లే తన భార్య చనిపోయిందంటూ..
Covid 19 Vaccine: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న..
Covid 19 Vaccine: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న మహిళ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెఘా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పూడివలస గ్రామానికి చెందిన హైమావతి అనే వివాహిత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సీన్ వేయించుకున్న సాయంత్రానికి హైమావతి తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో ఆమె భర్త ఆమెను చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైమావతి ప్రాణాలు కోల్పోయింది.
దీంతో మృతురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. కరోనా వ్యాక్సిన్ వికటించి తన భార్య మృతి చెందిందని ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం జాయింట్ కలెక్టర్ వరకు వెళ్లడంతో.. హైమావతి మృతిపై విచారణ చేపట్టాలని జేసీ సుమిత్ కుమార్ ఆదేశించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని మృతురాలి భర్తకు జేసీ హామీ ఇచ్చారు.
Also read:
Postal Schemes: పోస్టాఫీసుల్లో అదిరిపోయే స్కీమ్స్ అందుబాటులో.. నెలకు రూ.172 చెల్లిస్తే రూ.3 లక్షలు