ఎన్డీయేలో ఉండాలో, వద్దో తేల్చుకోండి.చిరాగ్ పాశ్వాన్ కి తేజస్వి యాదవ్ లేఖ..
లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ రాసిన లేఖ సంచలనం రేపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆయన ఈ లేఖలో కోరారు. ఆ కూటమిలో ఉండాలో..వద్దో తేల్చుకోండి... గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి అన్నారు.
లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ రాసిన లేఖ సంచలనం రేపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆయన ఈ లేఖలో కోరారు. ఆ కూటమిలో ఉండాలో..వద్దో తేల్చుకోండి… గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి అన్నారు. మీ ఎల్ జె పీలో చీలికలు రావడానికి బీహార్ లోని జేడీ యూ సూత్రధారి అని ఆయన ఆరోపించారు. 2005 లోను..2010 లో కూడా మీ పార్టీలో ఇలాంటి చీలికలు వచ్చాయన్నారు. మీ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు మా తండ్రి..ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజ్యసభ సీటునిచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆర్ ఎస్ ఎస్ సిధ్ధాంతా లను పాటిస్తున్నవారితో ఉండాలనుకుంటారో..లేక రాజ్యాంగాన్ని రూపొందించిన బీ.ఆర్.అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలనుకుంటున్నవారితో ఉండాలనుకుంటారో మీ ఇష్టం అని తేజస్వి పేర్కొన్నారు. లోక్ జన శక్తి పార్టీలో చీలికలు రావడానికి తమ పార్టీ కారణం కాదని జెడి-యూ నేత సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల అనంతరం తేజస్వి.. చిరాగ్ కి ఈ లేఖ రాశారు.
లోక్ జనశక్తి పార్టీ వారు మమ్మల్ని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారో అర్థం కావడంలేదని నితీష్ కుమార్ అన్నారు. వాళ్ళ పబ్లిసిటీ కోసం మమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలా ఉండగా బీజేపీతో తమ పార్టీ సంబంధాలు ఏకపక్షంగా ఉండరాదని ఇటీవల చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే ఆ పార్టీతో సంబంధాల విషయాన్నీ పునరాలోచించుకుంటామన్నారు. అటు తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ జన్మ దీనమైన జులై 5 న తాను బీహార్ లో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర లేదా రోడ్ షోలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.