85 దేశాల్లో డెల్టా వేరియంట్..ఇండియా విషయం సీరియస్..ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్

డెల్టా వేరియంట్ 85 దేశాల్లో విస్తరించిందని, ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్ఛునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 దేశాల్లో వేరియంట్ అల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బేటా, 71 దేశాల్లో గామా కొనసాగుతున్నాయని. వీటిని నిర్లక్ష్యం చేయరాదని...

85 దేశాల్లో డెల్టా వేరియంట్..ఇండియా విషయం సీరియస్..ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్
Corona Vaccine
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 24, 2021 | 2:45 PM

డెల్టా వేరియంట్ 85 దేశాల్లో విస్తరించిందని, ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్ఛునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 దేశాల్లో వేరియంట్ అల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బేటా, 71 దేశాల్లో గామా కొనసాగుతున్నాయని. వీటిని నిర్లక్ష్యం చేయరాదని ఈ సంస్థ ఈ నెల 22 నాటి తన తాజా నివేదికలో తెలిపింది. కొత్త కోవిద్ కేసుల్లో ఇండియాకు సంబంధించి అత్యధిక కేసులు వెలుగు చూశాయని..జూన్ 14 నుంచి 20 వతేదీ బెవరకు..వారం రోజుల్లో 441,976 కేసులు నమోదయ్యాయని ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 30 శాతం ఎక్కువని వివరించింది. ఇదే సమయంలో ఇండియాలో 16,329 మంది మృతి చెందినట్టు తెలిపింది. అన్-లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తిరిగి కేసులు పెరుగుతున్నతీరును తాము గమనిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. వివిధ రకాల వ్యాక్సిన్లు ఈ వేరియంట్లను కట్టడి చేస్తున్నప్పటికీ.. కోవిద్ ప్రొటొకాల్స్ మాత్రం తప్పదని..మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటివి నేటికీ అనివార్యమని పేర్కొంది..

ఇక ఇండియాలో డెల్టా ప్లస్ కేసులు మెల్లగా మెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకవంటి రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది. మరో 14 మందికి సంబంధించిన శాంపిల్స్ ను వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపారు. మొదట 22 కేసులతో మొదలైన డెల్టా ప్లస్ కేసులు క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.

Viral Video : పెళ్లిమండపంలో వరుడికి రీడింగ్‌ టెస్ట్‌ పెట్టిన వధువు..పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.

కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.