AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు యువకుల మృతి..

Mancherial: మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలోని మాదారం టౌన్‌షిప్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్ద యువకుల..

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు యువకుల మృతి..
Died
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2021 | 8:13 AM

Share

Mancherial: మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలోని మాదారం టౌన్‌షిప్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్ద యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాదారం ప్రాంతానికి చెందిన సతీష్(21), వాసు(18) ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ మాదారం శివారులో ఉన్న నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు ఆ నీటి కుంటలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అయితే, సరదాగా బయటకు వెళ్లిన యువకులిద్దరూ అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనచెందారు.

విషయాన్ని సతీష్, వాసు స్నేహితులకు తెలిపి.. వారి సహాయంతో ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామం అంతా గాలించారు. చివరికి నీటికుంటలో పడిపోయినట్లు గుర్తించి.. వారి మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు రోధనలు ఆకాశాన్నంటాయి. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు.. నీటిలో పడి చనిపోయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read:

Cluster Fig Benefits: అత్తి పళ్లతో ఈ వ్యాధులకు చెక్.. డయాబెటిస్ ఉన్నవారు ఈ పళ్లను తినోచ్చా ?

Bill Gates Daughter: బిల్‌గేట్స్‌ గారాల కూతురు ఫీబీ అడెల్‌ గేట్స్‌ గురించి మీకు తెలుసా..?

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం.. రేపే ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల!