Dowry Harrassment: వరకట్నం కాటేసింది.. భర్త వేధింపులకు యువతి ఆత్మహత్యాయత్నం.. నాలుగు రోజులుగా చికిత్సపొందుతూ మృతి!
సమాజంలో దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బలహీనుల్ని బలి తీసుకుంటూనే ఉన్నాయి. వరకట్న దాహనికి మరో యువతి బలైంది. పెళై ఆరేళ్ల అయిన భర్తకు కట్నం మీద యావ తగ్గలేదు
Woman commits suicide for Harrassment Dowry: సమాజంలో దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బలహీనుల్ని బలి తీసుకుంటూనే ఉన్నాయి. వరకట్న దాహనికి మరో యువతి బలైంది. పెళై ఆరేళ్ల అయిన భర్తకు కట్నం మీద యావ తగ్గలేదు. వీరికి ఓ పాప పుట్టినప్పటికీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలంటే వేధింపులు తప్పలేదు. చివరికి మరణమే శరణ్యం అనుకున్న ఆ అబల బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, ఈ దారుణానికి సంబంధించి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కోదాడకు చెందిన నరేష్‌తో కేతేపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన శృతికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప ఉంది. అయితే, కాపురం సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో వరకట్నం బూచి వెలుగుచూసింది. గత కొంతకాలంగా వరకట్నం కోసం భర్త నరేష్ వేధించడంతో భార్య శృతి నాలుగు రోజుల క్రితం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ శృతి మృతి చెందింది. దీంతో నరేష్ ఇంటి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.