Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం.. రేపే ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల!
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రేపు వెల్లడించే..
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రేపు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ మార్కులను ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కులు వేయడం జరుగుతుందని ఇంటర్ బోర్డు తెలిపింది.
ఈ మేరకు శుక్రవారం నాడు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని అధికారిక సమాచారం. ఇదిలాఉంటే.. ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు, ఫస్ట్ ఇయర్‌లో ఫైయిల్ అయిన వారికి 35 శాతం లెక్కన పాస్ మార్కులు ఇవ్వనున్నారు. కాగా, రాష్ట్ర వ్యా్ప్తంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం 4,73,967 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఫలితాలను బోర్డు అధికారులు అఫిషియల్ వెబ్ సైట్ అయిన https://tsbie.cgg.gov.in లో చూడొచ్చు.
Also read: