Poonam Pandey: భారత్- న్యూజిలాండ్ క్రికెట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ పాండే.. భర్త రియాక్షన్..
WTC Final: బాలీవుడ్ నటి పూనమ్ పాండే.. తరచూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... వార్తల్లో నిలుస్తుంటారు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడే ఈ బ్యూటీ గతంలో
WTC Final: బాలీవుడ్ నటి పూనమ్ పాండే.. తరచూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… వార్తల్లో నిలుస్తుంటారు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడే ఈ బ్యూటీ గతంలో 2011 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇడియా గెలిస్తే నగ్నంగా మైదానంలో తిరుగుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరోసారి పూనమ్ క్రికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ పై తన అభిప్రాయం చెప్పాల్సిందిగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్డ్ అడగ్గా ఆమె స్పందించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిచింది. పూనమ్ మాట్లాడుతూ.. క్రికెట్ స్టార్ట్ అయ్యిందా ? జనం క్రికెట్ ఆడుతున్నారా..? ఈ సారి కూడా భారత జట్టు గెలిస్తే నగ్నంగా తిరుగుతా అని మళ్లీ చెప్పాలా ? అంటూనే ఈ మ్యాచ్ గురించి తనకు తెలియదని.. ఇంటికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పింది.
ఇక ఆమె వ్యాఖ్యలపై పూనమ్ భర్త సామ్ బాంబే స్పందిస్తూ.. తనకు బదులుగా ఈసారి తాను నగ్నంగా తిరుగుతా అని సమధానం ఇచ్చాడు. దానికి వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఒడిపోతుంది అంటూ పూనమ్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. చివరకు తాను ఇండియా గెలవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. తెలుగులో పూనమ్ మాలిని అండ్ కంపెనీ అనే సినిమా చేసింది. మె గతేడాది సెప్టెంబర్ 1న దర్శకుడు సామ్ బాంబేను పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది.
Soundarya Home: సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుకున్న ఇల్లు.. ఇప్పుడు ఎలా ఉందంటే..