AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya Home: సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుకున్న ఇల్లు.. ఇప్పుడు ఎలా ఉందంటే..

సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే..

Soundarya Home: సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుకున్న ఇల్లు.. ఇప్పుడు ఎలా ఉందంటే..
Soundarya
Rajitha Chanti
|

Updated on: Jun 24, 2021 | 7:10 AM

Share

సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్య స్థానం ప్రత్యేకం. కళ్లతోనే ఎన్నో భావాలను పలికించగల అరుదైన నటిగా గుర్తింపు పొందారు సౌందర్య. అందుకే ఆమెను అంతా అభినవ సావిత్రి అంటుండేవారు. టాలీవుడ్ లో అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సౌందర్య ఎక్కడా కూడా గ్లామర్ పాత్రలు చేయకుండా.. చీరకట్టుతోనే సూపర్ హిట్స్ అందుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సౌందర్య. తెలుగు, తమిళతోపాటు.. కన్నడ, హిందీ భాషల్లో కలిపి 100 పైగా చిత్రాల్లో నటించారు సౌందర్య. అయితే అంత చిన్న వయసులోనే సౌందర్య రూ. వంద కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిందని గతంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. సౌందర్య తన సోదరుడు అమర నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. విమాన ప్రమాదంలో ఆమె సొదరుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సౌందర్య కుటుంబం ఇప్పటికీ ఆ స్కూల్స్ కు ఆర్థిక సహాయం చేస్తున్నారు.

ఇటీవల సీనియర్ హీరోయిన్ ఆమల ఓ ఇంటర్వూలో సౌందర్య ఆస్తుల గురించి ప్రస్తవించింది. సౌందర్య బెంగుళూరులోని ఓ ఇళ్లును ఎంతో ఇష్టపడి కొనుక్కుందని.. ఆమె బతికి ఉన్నప్పుడు ఆ ఇళ్లు ఎంతో వైభవంగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఓ బూత్ బంగ్లాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు తాను వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని, తనని కలుద్దామని అక్కడి వెళ్లేసరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల సౌందర్య బయోపిక్ అంశం తెరపైకి రావడంతో.. అందులో నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతున్నారు.

Also Read: Judgement: కొడుకు బాధ్యత 18 ఏళ్లకే తీరిపోదు.. అప్పటివరకు భరించాల్సిందే.. తండ్రికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..

Fake Currency: రంగురాళ్ల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. జ్యోతిష్యుడి ఇంట్లోనే రూ.18 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..