- Telugu News Photo Gallery Viral photos Meet microsoft founder bill gates melinda gates glamorous and stylish daughter phoebe adele gates
Bill Gates Daughter: బిల్‌గేట్స్ గారాల కూతురు ఫీబీ అడెల్ గేట్స్ గురించి మీకు తెలుసా..?
బిల్‌గేట్స్ గురించి కొత్తగా తెలియాల్సిందేమి లేదు. అందరికి తెలిసిందే. అయితే ఆయన కూతురు ఫీబీ అడెల్ గేట్స్ హాట్ టాపిక్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు..
Updated on: Jun 24, 2021 | 7:58 AM

Bill Gates Daughter: బిల్‌గేట్స్ గురించి కొత్తగా తెలియాల్సిందేమి లేదు. అందరికి తెలిసిందే. అయితే ఆయన కూతురు ఫీబీ అడెల్ గేట్స్ హాట్ టాపిక్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిందా గేట్స్ ముద్దుల కూతురు ఆమె. 18 ఏళ్ల ఈ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తోంది. బిల్ గేట్స్ కుమార్తెల్లో ఈమెకు మాత్రమే ఆ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

బిల్‌గేట్స్ దంపతులకు తమ విడాకుల గురించి మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిగ్గా మారింది. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు వారు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే బిల్‌గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే చిన్నమ్మాయి ఫీబీ అడెల్ గేట్స్. అయితే గేట్స్ ముగ్గురు కూతుర్లో బిట్‌గేట్స్ లక్షణా ఆయన చిన్న కూతురిలో ఉన్నాయని, ఎప్పటికైనా ఆమె ఆయనలాగే స్వతహాగా పైకి ఎదుగుతుందని గేట్స్ సన్నిహితులు చెబుతున్నారు.

తండ్రి గేట్స్ తెలివి తేటలను అందిపుచ్చుకున్న ఫీబీ పుణి.. ఏప్రిల్ 14, 2002లో వాషింగ్టన్‌లో జన్మించారు. చిన్ననాటి నుంచి ఆమె ఎంతో చురుగ్గా ఉంటారు. అందరిలో కలిసిమెలసి ఉంటారట. మొదట న్యూయార్క్‌లోని ప్రొఫెషనల్ చిల్డ్రన్ పాఠశాలలో చేరింది. ఆ తర్వాత లింకన్ సెంటర్‌లోని అమెరికన్ బ్యాలెట్ పాఠశాలలో ఆర్ట్స్ అధ్యయనం చేసింది.

అయితే ధనవంతుడి కూతురైనప్పటికీ తన 14వ ఏటా వరకు ఫీబీ స్మార్ట్‌ఫోన్‌కు దూరంగానే ఉన్నారు. అందులో గేట్స్ పాత్ర కూడా ఎంతగానే ఉంది. పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే కొంతకాలం వాళ్లని స్మార్ట్‌ఫోన్లకి దూరంగా ఉంచాలని గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఆమె 14 ఏళ్ల వరకు వరకు ఫోన్ ముట్టలేదని తెలుస్తోంది.

గేట్స్ కూతురు పొట్టి పొట్టి దుస్తుల్లో తళుక్కుమని మెరిసిపోతుంటుంది. కొన్నాళ్ల కిందట బోటు షికారులో బికినీ వేసుకొని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తాను సంపాదించిన ఆస్తి తన సంతానానికి చెల్లబోదని బిల్‌గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. ముగ్గురికీ తలో 10 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని, మిగతా సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని బిల్‌గేట్స్ గతంలోనే ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులకు మాత్రం మంచి క్రేజ్ ఉంటోంది.




