Kalonji Seeds Benefits : ఉల్లి, మిరియాల రుచిని తలపించే నల్లజీలకర్రలో ఎన్నో ఔషధగుణాలు..
Kalonji Seeds : జీలకర్ర పురాతనకాలం నుండి ఉపయోగించబడుతుంది. అయితే జీలకర్రను ఈజిప్ట్ నాగరికతలో సుంగధ ద్రవ్యంగా ఉపయోగించబడిందని తెలుస్తోంది. ఈ జీలకర్ర రెండు రకాలు..
Kalonji Seeds : జీలకర్ర పురాతనకాలం నుండి ఉపయోగించబడుతుంది. అయితే జీలకర్రను ఈజిప్ట్ నాగరికతలో సుంగధ ద్రవ్యంగా ఉపయోగించబడిందని తెలుస్తోంది. ఈ జీలకర్ర రెండు రకాలు. ఒకటి మనం రోజూ వంటల్లో ఉపయోగించే మాములు తెల్ల జీలకర్ర. రెండో నల్ల జీలకర్ర. దీనిని షాజీరా అని కూడా అంటారు. నల్లజీలకర్ర పొడి రుచి ఉల్లి, మిరియాల రుచిని తలపిస్తుంది. ఈ నల్లజీలకర్రకు ఆయుర్వేదం ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఔషధ గుణాలను కల్గి ఉంది. నల్లజీలకర్ర పొడిని ఎక్కువగా బ్రెడ్, బిస్కట్లు, రొట్టెలు, ఇడ్లీ, టీ, సూప్స్‌ల్లో వేకుంటారు. ఆరోగ్యాన్ని అనేక ప్రయోజనాలు ఇస్తుంది. అవేమిటో చూద్దాం..
నల్లజీలకర్ర లో విటమిన్-బి1, బి2, బి3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ నల్లజీలకర్ర లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సప్లమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
*ఈ షాజీరాను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. *రోజూ నల్లజీలకర్ర ను తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. *తేనె, నల్ల జీలకర్ర విత్తనాల పొడి, వెల్లుల్లిని కలిపి ఔషధంగా తయారుచేస్తారు. దీన్ని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి
*రక్తసరఫరాను క్రమబద్దీకరిస్తుంది. దీంతో కండరాల పనితీరు మెరుగుపడుతుంది. తిమ్మిర్లు, అవయవాలు మొద్దుబారినట్టు ఉండే భావన నుంచి ఉపశమనం లభిస్తుంది.
*హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని కాపాడుతుంది.
నల్లజీలకర్రను వాడడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అయితే అతిసర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఎక్కువగా కూడా దీనిని వాడకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: రైతులకు లాభాలను పండిస్తున్న ఆవాల పంట.. ప్రభుత్వం విత్తనాల కొరత లేకుండా చూడాలంటున్న అన్నదాత