Fruit Consumption: ఆరోగ్యానికి మంచివే.. పండ్లను ఇలా తింటే మాత్రం 100 రెట్లు డేంజర్..
ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, పండ్లు తింటే సరిపోదు, వాటిని ఎలా, ఎప్పుడు, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపైన మన ఆరోగ్య ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చాలామంది పండ్లు తినే విషయంలో తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఈ పొరపాట్లు వలన పండ్ల నుంచి పూర్తి ప్రయోజనం పొందలేకపోవడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరి, పండ్ల నుంచి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి నిపుణులు సూచించే ఆ 9 ముఖ్యమైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో పండ్లు సులువైన మార్గం. పండ్లు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. బరువు, రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా సహాయపడతాయి. అయితే, పండ్లు తీసుకునే విధానం, పరిమాణం, వాటితో కలిపి ఏం తింటున్నాం అనేవి మన ఆరోగ్యంపై చాలా కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లు తినేటప్పుడు ప్రజలు చేసే 9 సాధారణ పొరపాట్లు, వాటిని సరిచేసే విధానం ఇక్కడ చూద్దాం.
పండ్లు తినేటప్పుడు చేయకూడని 9 పొరపాట్లు పండు బదులు రసం తాగడం: పండ్ల రసాలు తీయడం వలన వాటిలోని పీచు పదార్థం (ఫైబర్) పోతుంది. పీచు జీర్ణక్రియకు చాలా ముఖ్యం. రసం వలన చక్కెర గాఢత పెరిగి, త్వరగా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల, పండును మొత్తంగా తినాలి.
భోజనం తరువాత తియ్యటి పదార్థంగా తినడం: పండు ఏ సమయంలో తింటారనేది రక్తంలో చక్కెర స్థాయిల పైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న భోజనం తినడానికి 20-30 నిమిషాల ముందు పండు తీసుకుంటే, అది చక్కెర పెరుగుదలన తగ్గిస్తుంది.
ఎండు పండ్ల పై ఆధారపడటం: ఎండు పండ్లలో నీరు తొలగిపోతుంది. దానివలన వాటిలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. వాటిని సులభంగా అధికంగా తినే అవకాశం ఉంటుంది. ఎండు పండ్లన్ పెరుగు లేదా సలాడ్ లో అలంకరణగా, చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి.
స్మూతీస్ లో కలపడం: పండును జ్యూస్ చేయడం కంటే స్మూతీస్ మంచిది కాదు. ఎందుకంటే స్మూతీస్ లో పండులోని కణ గోడలు విరిగిపోతాయి. పాలు లేదా తేనె కలపడం వలన కేలరీలు, చక్కెర పెరుగుతుంది. తప్పనిసరి అయితే, స్మూతీలో పండ్లతోపాటు కూరగాయలు, ప్రొటీన్ పౌడర్ కలపడం మంచిది.
సహజ చక్కెర సురక్షితం అనుకోవడం: మధుమేహం ఉన్నవారు పిండి పదార్థాలను లెక్కించకుండా ఎక్కువ మొత్తంలో పండ్లు తింటే, చక్కెర నియంత్రణ మరింతగా తగ్గుతుంది. పరిమాణం నియంత్రిస్తే, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు సురక్షితమే.
పుల్లని పండ్లుతో దంతాల నిర్లక్ష్యం: పుల్లని పండ్లు లేదా పండ్ల రసాలను తరచుగా తీసుకోవడం వలన దంతాల ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంది. పుల్లని పండ్లు తిన్న తరువాత నోటిని నీటితో కడగాలి. 30 నిమిషాల తరువాత మాత్రమే పళ్లు తోముకోవాలి.
కేలరీలు, పరిమాణం విస్మరించడం: పండ్లు పోషకాలు కలిగి ఉన్నా, కొన్నింటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, మామిడి, అవకాడో వంటి కేలరీలు ఎక్కువ ఉన్న పండ్లను తీసుకునేటప్పుడు పరిమాణాన్ని లెక్కించాలి. తగిన సంతృప్తి కోసం ప్రొటీన్ లేదా పీచుతో కలిపి తినాలి.
రకాలు మార్చకపోవడం: వేర్వేరు పండ్లు వేర్వేరు పోషకాలు, ఫైటోకెమికల్స్ అందిస్తాయి. ఆహారంలో పండ్ల రకాలు మారుస్తూ ఉంటే, శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. సీజన్ లో సేంద్రీయంగా లభించే పండ్లను ఎంచుకోవడం మంచిది.
పండ్ల డైట్ మాత్రమే పాటించడం: ఒకే రకం ఆహారంపైన ఆధారపడే డైట్లలో ప్రొటీన్, ముఖ్యమైన కొవ్వులు, పీచు, ఇతర పోషకాలు లోపిస్తాయి. ఈ డైట్లు స్థిరంగా ఉండవు. ఒక్కోసారి అవి ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంది. పండ్లను సమతుల్య ఆహారంలో భాగంగానే తీసుకోవాలి.
పండ్లు పీచు, విటమిన్లు, పొటాషియం, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు అందిస్తాయి. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకుని పండ్లు తినడం వలన అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన పండ్ల వినియోగ చిట్కాలు, సలహాలు కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఇది ఏ విధంగానూ నిపుణులైన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.




