AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ పాదాలలో మీ ఆరోగ్య గుట్టు.. ఈ 3 లక్షణాలు దేనికి సంకేతమో తెలిస్తే షాకే..

మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను మనం తేలిగ్గా తీసుకోకూడదు. మీ పాదాలు వాపుగా, బరువుగా అనిపించినా, నొప్పి, తిమ్మిరి వచ్చినా లేదా రంగు, ఉష్ణోగ్రత మారినా.. వాటిని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి..? వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు ఎలా దారితీస్తుంది..? అనేది తెలుసుకుందాం..

Health Tips: మీ పాదాలలో మీ ఆరోగ్య గుట్టు.. ఈ 3 లక్షణాలు దేనికి సంకేతమో తెలిస్తే షాకే..
3 Foot Symptoms That Signal Poor Blood Circulation
Krishna S
|

Updated on: Oct 14, 2025 | 6:13 PM

Share

మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ కొన్ని లక్షణాలు పదే పదే కనిపిస్తే మాత్రం వాటిని విస్మరించడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అనేది ప్రాణాంతక సమస్యలకు దారి తీయవచ్చు. రక్త ప్రసరణ లోపం యొక్క ముఖ్యమైన సంకేతాలు మన పాదాలలో కనిపిస్తాయి. మీ పాదాలలో మీరు అనుభవించే మూడు ప్రధాన లక్షణాలు, వాటిని విస్మరిస్తే కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుందాం..

పాదాలలో వాపు, బరువు

ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లేదా ఎక్కువసేపు నిలబడిన తర్వాత మీ పాదాలు, చీలమండలలో వాపు వస్తే, అది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం. వైద్య పరిభాషలో దీనిని ఎడెమా అంటారు. రక్త ప్రసరణ మందగించడం వల్ల రక్తం, ఇతర ద్రవాలు పాదాలలో పేరుకుపోయి.. అవి బరువుగా, వాపుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు గట్టి బూట్లు ధరించడం కూడా రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.

కాళ్ల నొప్పి, తిమ్మిరి

మీరు రోజూ నడుస్తున్నప్పుడు లేదా రాత్రి నిద్రలో మీ కాళ్ళలో తరచుగా నొప్పి, తిమ్మిరి లేదా జలదరింపు వస్తుంటే ఇది రక్త ప్రసరణ లోపమే కావచ్చు. రక్త నాళాలలో రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల, కండరాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల నొప్పి, తిమ్మిరి వస్తాయి. మీరు నడుస్తున్నప్పుడు కాళ్ళలో నొప్పి వచ్చి, ఆగిన వెంటనే నొప్పి తగ్గితే, దానిని క్లాడికేషన్ అంటారు. ఇది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి అత్యంత సాధారణ లక్షణం.

పాదాల రంగు

మీ పాదాలు, ముఖ్యంగా కాలి వేళ్లు చల్లగా అనిపించడం లేదా పాదాల రంగు నీలం, ఊదా లేదా ఎరుపు రంగులోకి మారడం వంటివి రక్త ప్రసరణ లోపానికి సంకేతాలు. రక్త ప్రసరణ సరిగా లేకపోతే పాదాలకు తగినంత వేడి అందదు, అందుకే చల్లగా ఉంటాయి.

గాయం మానకపోవడం

పాదంలో గాయం అయినప్పుడు అది మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అప్రమత్తంగా ఉండాలి. గాయం నయం కావడానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందకపోవడమే దీనికి కారణం.

మీరు ఈ లక్షణాలలో దేనినైనా నిరంతరం అనుభవిస్తే, వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అనేది గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా కణజాలం చనిపోయే గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్ర పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..