AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matti Kusthi: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మట్టి కుస్తీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాగా చిత్రం 'గట్ట కుస్తీ'(తెలుగులో మట్టి కుస్తీ'). ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

Matti Kusthi: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే.?
Matti Kusthi
Ravi Kiran
|

Updated on: Dec 27, 2022 | 6:07 PM

Share

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాగా చిత్రం ‘గట్ట కుస్తీ'(తెలుగులో మట్టి కుస్తీ’). స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి చెళ్ల అయ్యవు దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ అయిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో మాత్రం వసూళ్లు పరంగా కమర్షియల్‌ హిట్ సాధించలేకపోయింది. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

మట్టి కుస్తీ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని 2023 జనవరి 1వ తేదీ నుంచి తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. కాగా, ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అలాగే హీరో విష్ణు విశాల్‌కు చెందిన విష్ణు విశాల్ స్టూడియోస్, మాస్ రాజా రవితేజకు చెందిన RT టీమ్‌వర్క్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.