Vishal: హీరో విశాల్ ఇంటిపై దాడి.. రాళ్లు రువ్విన దుండగులు.. ధ్వంసమైన అద్దాలు.. వీడియో

ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విశాల్ తరపున ఆయన మేనేజర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Vishal: హీరో విశాల్ ఇంటిపై దాడి.. రాళ్లు రువ్విన దుండగులు.. ధ్వంసమైన అద్దాలు.. వీడియో
Vishal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2022 | 5:45 AM

ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విశాల్ తరపున ఆయన మేనేజర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాల్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని అన్నానగర్‌లో నివసిస్తున్నాడు. సోమవారం (26-09-2022) రాత్రి ఎరుపు రంగు కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో విశాల్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, దుండగుల దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను కూడా పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు విశాల్‌ షూటింగ్‌ నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. తమిళ, దక్షిణ చిత్రసీమలో ప్రముఖ నటుడు, తమిళ సినీ పరిశ్రమ నడిగం సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది. విశాల్ ఇంటిపై దాడి ఎవరు చేశారు..? దీనిలో ఎవరి ప్రమేయం ఉంది..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నటుడు విశాల్ ప్రస్తుతం లాఠీ, తుపరివాలన్-2, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న లాఠీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. విశాల్ గత చిత్రాలైన వీరమే వాగై సూదుం, శత్రువు, చక్రం, యాక్షన్ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం లాఠీ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తుప్పరివాలన్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో అభిమానులు తదుపరి భాగం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..