Health Tips: ఆ సమస్యలు ఉన్నవారు మెంతులు అస్సలు తినకూడదు.. అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతిన్నట్లే..

మెంతులు రుచికి కొంచెం చేదుగానే ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఇందులో మెండుగా ఉన్నాయి. మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా సమస్యలను నివారించవచ్చు.

Health Tips: ఆ సమస్యలు ఉన్నవారు మెంతులు అస్సలు తినకూడదు.. అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతిన్నట్లే..
Fenugreek Side Effects
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 27, 2022 | 6:04 AM

Fenugreek Side Effects: మెంతులు రుచికి కొంచెం చేదుగానే ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఇందులో మెండుగా ఉన్నాయి. మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా సమస్యలను నివారించవచ్చు. మెంతి గింజలు ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి, మెంతి గింజలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. మెంతులు, మెంతికూరలో ఫైబర్, ప్రొటీన్, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో కడుపు సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తాయి. అంతేకాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సలో కూడా మెంతి గింజలను ఉపయోగిస్తారు. కానీ ఏది ఎక్కువగా తీసుకున్నా.. అది ప్రమాదం అన్న విషయం మెంతి గింజలకు కూడా వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో మెంతి గింజలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. ఎలాంటి వ్యక్తులు మెంతులకు దూరంగా ఉండాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలు మెంతులకు దూరంగా ఉండాలిః గర్భిణులలో రక్తం గడ్డకట్టడం నెమ్మదిగా జరుగుతుంది. అందువల్ల వారు మెంతి గింజలను తీసుకోకుండా ఉండాలి. మరోవైపు, గర్భిణీ స్త్రీలు మెంతి గింజలను తీసుకుంటే వారికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. కావున గర్భిణీ స్త్రీలు మెంతి గింజలను తినకూడదు.

శ్వాసకోశ సమస్యః మెంతి గింజలు శరీరానికి మేలు చేస్తాయి. కానీ శ్వాసకోశ వ్యాధులకు మందులు తీసుకుంటుంటే అలాంటివారు మెంతులు తీసుకోవడం మానుకోవాలి. ఇది ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అధిక రక్త పోటుః అధిక రక్తపోటు ఉన్నవారు మెంతి గింజలను తినకూడదు. ఒకవేళ మెంతులు తింటే రక్తపోటు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కావున BP అధికంగా ఉన్న రోగులు మెంతి గింజలను దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..