Health Tips: రోజూ డిన్నర్‌ ఇలా చేస్తే వారంలో బరువు తగ్గొచ్చు.. మీరు కూడా ట్రై చేయండి..

ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఫిట్‌గా ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు.

Health Tips: రోజూ డిన్నర్‌ ఇలా చేస్తే వారంలో బరువు తగ్గొచ్చు.. మీరు కూడా ట్రై చేయండి..
Weight Loss
Follow us

|

Updated on: Sep 26, 2022 | 6:56 AM

Weight loss tips: ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఫిట్‌గా ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. చాలామంది బరువు తగ్గేందుకు జిమ్‌లల్లో చెమటోడ్చడంతోపాటు ఏవేవో డైట్లు పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే మంచి ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే సమయంలో రాత్రి భోజనం ఎల్లప్పుడూ తేలికగా ఉండాలన్న విషయం అందరికీ తెలుసు. తద్వారా మీరు తగినంత నిద్ర పొందవచ్చు.. ఇంకా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అదే సమయంలో రాత్రి భోజనం నిద్రించడానికి ఒక గంట ముందు చేయాలి. తద్వారా పూర్తి నిద్రను పొందవచ్చు. మరోవైపు, మీరు రాత్రి భోజనాన్ని తొందరగా, తక్కువగా తింటే అది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు పలు ఆహార పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రాత్రి భోజనంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి, రాత్రి భోజనంలో వీటిని తినండి

పెసర పప్పుః పెసర పప్పులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది మీ రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా బరువును సైతం తగ్గిస్తుంది. మీరు కూడా మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే రాత్రి భోజనంలో పెసర పప్పును తీసుకోవచ్చు.

సగ్గుబియ్యం ఖిచ్డీః సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాని కారణంగా తినడానికి తేలికగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ రాత్రి భోజనంలో వీటిని తినవచ్చు. దీన్ని తినడానికి ఒక కప్పు సగ్గుబియ్యం కడిగి 6 గంటలు నానబెట్టండి. దీని తర్వాత గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించండి. ఆ తర్వాత బంగాళదుంపలు, శెనగపప్పు, ఉప్పు, శనగలు, కొత్తిమీర వేసి ఉడికించాలి. ఆ తర్వాత నిమ్మకాయ పిండితో తినండి.

బొప్పాయి సలాడ్ః బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలలో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ రాత్రి భోజనంలో దీనిని తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..