AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alekhya- YS Sharmila: తారకరత్న భార్య బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన వైఎస్ షర్మిల.. వీడియో వైరల్

నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో అతని భార్య అలేఖ్యా రెడ్డి బాగా కుంగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుంటాడని ఎన్నో కలలు కన్న ఆమె ఈ విషాదం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. నిత్యం తన భర్త అందించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.

Alekhya- YS Sharmila: తారకరత్న భార్య బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన వైఎస్ షర్మిల.. వీడియో వైరల్
Alekhya, YS Sharmila
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 6:55 PM

Share

నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో అతని భార్య అలేఖ్యా రెడ్డి బాగా కుంగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుంటాడని ఎన్నో కలలు కన్న ఆమె ఈ విషాదం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. నిత్యం తన భర్త అందించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో తారక రత్న, పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతుంటుంది. ఇదిలా ఉంటే బుధవారం (ఆగస్టు 08) అలేఖ్యా రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అలేఖ్యకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తె అంజలితో కలిసి అలేఖ్య పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటి కెళ్లి కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. దీంతో తారకరత్న సతీమణి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. షర్మిల ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఆ తర్వాత అందరికీ బర్త్ డే కేక్ తినిపించింది. ఈ వీడియోను అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా.. ఇప్పుడు అదికా స్తా వైరల్ గా మారింది.

‘గత కొన్నేళ్లుగా నా పక్కన ఉంటావు అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నావు అక్క. నా కోసం టైం ఇచ్చి.. నా పుట్టిన రోజును ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నువ్వు చేసే చిన్న పని కూడా నాకు దీవెనలా అనిపిస్తుంది. నువ్వు నాకెంత స్పెషల్ అనేది మాటల్లో చెప్పలేను. నీ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అక్క. లవ్ యూ షర్మిల అక్క’ అంటూ ఎమోషనలైంది అలేఖ్య. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

అలేఖ్యా రెడ్డి బర్త్ డే వేడుకల్లో వైఎస్ షర్మిల.. వీడియో ఇదిగో..

విజయ సాయి రెడ్డి ఫ్యామిలీతో తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి..

తారక రత్న- అలేఖ్యా రెడ్డి పిల్లలతో విజయ సాయి రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్