OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు పండగే.. శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. భారతీయుడు 2తో సహా..

ఉన్నంతలో కాస్త మెగా డాటర్  నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అనసూయ సింబా, భవనం, విజయ్ ఆంటోని తుఫాన్ లాంటి సినిమాలు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు పండగే.. శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. భారతీయుడు 2తో సహా..
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2024 | 4:46 PM

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది.  త్వరలో స్వాతంత్ర్య దినోత్సవం ఉండడంతో ఈ వారంలో థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఉన్నంతలో కాస్త మెగా డాటర్  నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అనసూయ సింబా, భవనం, విజయ్ ఆంటోని తుఫాన్ లాంటి సినిమాలు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అడుగు పెట్టగా శుక్రవారం (ఆగస్టు 09) మరికొన్ని స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం అందరి దృష్టి కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 పైనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మమ్ముట్టి, సునీల్ కలిసి నటించిన టర్బో మూవీపై కూడా కాస్త బజ్ ఉంది. వీటితో పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమా స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్కేద్దాం రండి.

నెట్ ఫ్లిక్స్

  • భారతీయుడు 2 (సినిమా) – ఆగస్టు 9

Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp

ఇవి కూడా చదవండి

— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024

  • ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా (సినిమా) – ఆగస్టు 9
  • కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లిష్‌) ఆగస్టు 9
  • మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌ సినిమా) – ఆగస్టు 9
  • ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లిష్‌)- ఆగస్టు 9
  • రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌ సినిమా)- ఆగస్టు 10

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • లైఫ్‌ హిల్‌ గయి (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9
  • ఖాటిల్‌ కౌన్‌? (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

జియో సినిమా

  • గుడ్చడి – ఆగస్టు 9

జీ5 ఓటీటీ

  • గ్యారా గ్యారా (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

ఆహా

  • డెరిక్ అబ్రహాం(మలయాళ సినిమా) – ఆగష్టు 10

  • 7/జీ (తమిళ సినిమా)- ఆగస్టు 9

సోనీలివ్‌

  • టర్బో (సినిమా) – ఆగస్టు 9

సింప్లీ సౌత్‌

  • అన్నపూరణి- ఆగస్టు 9(ఇండియాలో స్ట్రీమింగ్‌ లేదు)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.