Kalki 2898 AD OTT Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకటి కాదు., ఏకంగా రెండు..

Kalki 2898 AD OTT Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకటి కాదు., ఏకంగా రెండు..

Anil kumar poka

|

Updated on: Aug 08, 2024 | 5:21 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కల్కి ఇప్పటివరకు సుమారు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే కల్కి సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కల్కి ఇప్పటివరకు సుమారు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే కల్కి సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అది కూడా రెండు ఓటీటీల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందనే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

ఎస్ ! కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుందట. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు బయటికి వచ్చిన ఓ న్యూ.. పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ వారియర్స్, పీబీ కల్ట్స్ అనే ఫ్యాన్ పేజీలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ దర్శనమిచ్చింది. దీని ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కానుండగా.. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందట. అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ ఇంకా రావాల్సి ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.