AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7/G Movie OTT: ఓటీటీలోకి హార్రర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

తంత్ర, పిండం, పొలిమేర 2 వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ హార్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అదే 7/G. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో

7/G Movie OTT: ఓటీటీలోకి హార్రర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
7g Movie
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2024 | 2:49 PM

Share

కొన్నాళ్లుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో హారర్ థ్రిల్లర్ మూవీస్.. రొమాంటిక్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే మూడ నమ్మకాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించే చిత్రాలు, వెబ్ సిరీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తంత్ర, పిండం, పొలిమేర 2 వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ హార్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అదే 7/G. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా.. హారర్ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాను డ్రీమ్ హౌస్ పతాకంపై హరూన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ విషయాన్ని తమిళ్ ఆహా అధికారికంగా ప్రకటించింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత హీరోయిన్ సోనియా తనదైన నటనతో మెప్పించింది. గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన 7G బృందవన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

7/G చిత్రానికి హరూన్ దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు. ఇందులో సోనియాతోపాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలకపాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా రేపటి నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..