Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్‌కి కారణం ఏంటి? చనిపోవాలని ఎందుకు అనున్నాడు
గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మెంటల్ ఇష్యూస్ కనిపించడంతో పాటు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. వాస్తవంగా షణ్ముక్ తన కెరియర్‌ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్‌గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా...?
షణ్ముక్ జస్వంత్..! మంచి యూట్యూబర్.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతని సిరీస్‌లకు మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అని చెప్పొచ్చు. కొంతకాలం క్రితం మద్యం తాగి.. హిట్ అండ్ రన్ చేసిన కేసులో చాలా నెగిటివిటీ ఎదుర్కున్నాడు. సరే.. కుర్రతనం పొరపాట్లు జరుగుతాయ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి వార్తల్లో హెడ్ లైన్ అయ్యాడు. గాంజా కన్జూమర్ అని మెడికల్ రిపోర్టుల్లో తేలింది. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటాని.. డిప్రెషన్ లో ఉన్నానని అని ఏడుస్తూ అరుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న.. షణ్మక్ అన్న సంపత్ కోసం పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తాను డిప్రెషన్‌లో ఉన్నానని… ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని.. గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు షణ్ముక్. డిప్రెషన్ లో ఉండటం కారణంగానే… షణ్ముక్ గంజాయికి అలవాటు పడ్డాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు షణ్ముక్, సంపత్‌లపై పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. పలువురు యువతుల్ని అవకాశాల పేరుతో చీట్ చేసినట్లు చెబుతున్నారు. అందులో నిజం ఉంటే కచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే. అయితే షణ్ముక్ మెంటల్ హెల్త్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. అతను నిజంగానే డిప్రెషన్‌లో ఉంటే.. కౌన్సిలింగ్ అందించాల్సి ఉంటుంది.
సినిమా ఫీల్డ్ అనేది రంగుల ప్రపంచం.. అయితే ఇక్కడే అందరికీ కనిపించని చీకటి కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు టర్న్ ఇస్తుందో చెప్పలేం. ఎంతోమంది సినిమా ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. పైకి బానే కనిపించినా.. మనిషి లోపల కృంగిపోతూ ఉండొచ్చు. షణ్ముక్.. కెరీర్ గ్రాఫ్ ఈ మధ్య కాలంలో డౌన్ అవుతూ వస్తుంది. అతనికి లవ్ బ్రేకప్ కూడా అయ్యింది. అప్పటి నుంచి ముభావంగానే ఉంటున్నాడు. ఇన్ని సమస్యలు మధ్య ఇప్పుడు ఈ కేసులు. ఈ క్రమంలో షణ్ముక్ అంత బిగ్గరగా ఏడుస్తూ చెబుతున్నాడంటే.. అతని మెంటల్ హెల్త్ ఎస్సెస్ చేయాల్సి ఉంటుంది. గంజాయి సేవించినట్లు తెలియడంతో.. అతడిని ఆ రకంగానూ బాధితుడిగానే చూడాల్సి ఉంటుందని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.