Madhoo: ‘రోజా’ హిట్ తర్వాత అహంకారంతో అలా ప్రవర్తించాను.. మధుబాల సెన్సెషనల్ కామెంట్స్..

క్లాసికల్ హిట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో రోజా ఒకటి. కథ, కథనం పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఏదోక సందర్భంలో వింటూనే ఉంటాం. అయితే ఈ సినిమా విడుదల తర్వాత డైరెక్టర్ మణిరత్నంతో తనకు మంచి సంబంధాలు కుదరలేదని.. దర్శకుడితో తాను స్నేహపూర్వకంగా మసులుకోలేదని తెలిపింది మధుబాల.

Madhoo: 'రోజా' హిట్ తర్వాత అహంకారంతో అలా ప్రవర్తించాను.. మధుబాల సెన్సెషనల్ కామెంట్స్..
Madhoo
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2024 | 4:51 PM

దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ‘రోజా’. ఇప్పటికీ ప్రేమికుల మదిలో నిలిచిపోయే సినిమా ఇది. 1992లో విడుదలైన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామి, మధుబాల జంటగా నటించారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. క్లాసికల్ హిట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో రోజా ఒకటి. కథ, కథనం పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఏదోక సందర్భంలో వింటూనే ఉంటాం. అయితే ఈ సినిమా విడుదల తర్వాత డైరెక్టర్ మణిరత్నంతో తనకు మంచి సంబంధాలు కుదరలేదని.. దర్శకుడితో తాను స్నేహపూర్వకంగా మసులుకోలేదని తెలిపింది మధుబాల. అహంకారం.. పొగరుతో అందరినీ దూరం పెట్టానని.. రోజా సినిమాకు దర్శకుడికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి ?.. అని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు దర్శకుడితో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపడుతుంది సీనియర్ హీరోయిన్.

సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. రోజా, ఇరువర్ సినిమాల తర్వాత మణిరత్నం చిత్రాల్లో నటించకపోవడానికి కారణాలు వెల్లడించింది. “మణి సర్.. నటీనటులతో ఎంతో స్నేహపూర్వంగా ఉంటారు. నేను ఆయనను సంప్రదించడానికి చాలా ప్రయత్నించాను. ఎన్నో సార్లు ఆయనకు మేసేజ్ చేశాను. ఆయనంటే నాకు చాలా అభిమానం. గౌరవం. కానీ రోజా విడుదలైన తర్వాత నేను ఇలా లేను. ఆయన నాకేం ఫేవర్ చేశాడని ?.. ఆయనకు రోజా హిట్ క్రెడిట్ ఇవ్వాలని.. ఆయనకు ఒక రోజా కావాలి.. నాలో రోజాను చూసుకున్నాడు. కాబట్టి నన్ను తన సినిమాకు తీసుకున్నాడు. అంతేగా.. అందులో ప్రత్యేకత ఏముంది ? ఇలా యాటిట్యూడ్ చూపించాను.

కెరీర్ మొదట్లో నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు. మేకప్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నేనే చూసుకున్నాను. ఎప్పుడు నేనే ఒంటిరిగా ఉండిపోయాను. నాకేవరు సాయం చేయలేదు. అందుకే ఇతరులకు క్రెడిట్ ఇచ్చేందుకు నేను రెడిగా లేను. కానీ మణి సర్ క్రెడిట్‌కి అర్హుడు. ఆ సమయంలో ఆయనకు ఈ విషయం చెప్పాల్సింది కానీ.. ఆయనకే రోజా క్రెడిట్ ఇవ్వాల్సింది. ఆయనకే నాకు సినిమాల్లో గుర్తింపు ఇచ్చాడు. రోజా తర్వాత ఆయనతో నేను స్నేహపూర్వకంగా ఉండలేదు. సరైన అనుబంధాన్ని కొనసాగించలేదు. అందుకే ఆయన తర్వాతి సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు” అంటూ చెప్పుకొచ్చింది మధుబాల. ఆమె చివరిసారిగా సమంత నటించిన శాకుంతలం చిత్రంలో నటించింది. అలాగే స్వీట్ కరమ్ కాఫీ అనే తమిళ వెబ్ షోలో కూడా కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.