Blue Star OTT: ఏకంగా 3 ఓటీటీల్లో తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ ‘బ్లూస్టార్’ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
కోలీవుడ్ లో ఇటీవల మంచి హిట్ కొట్టిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా బ్లూ స్టార్. రాజకీయ అంశాలకు క్రికెట్ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల వరుసగా హిట్లు కొడుతోన్న అశోక్ సెల్వన్ ఇందులో హీరోగా నటించాడు. అతనికి జోడీగా కీర్తి పాండియన్ నటించింది. వీరిద్దరు గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.
క్రైమ్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను కూడా పాన్ ఇండియ స్థాయిలో అన్ని భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. అలా తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోలీవుడ్ లో ఇటీవల మంచి హిట్ కొట్టిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా బ్లూ స్టార్. రాజకీయ అంశాలకు క్రికెట్ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల వరుసగా హిట్లు కొడుతోన్న అశోక్ సెల్వన్ ఇందులో హీరోగా నటించాడు. అతనికి జోడీగా కీర్తి పాండియన్ నటించింది. వీరిద్దరు గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. భార్యాభర్తలుగా మారిన తర్వాత అశోక్, కీర్తి నటించిన మొదటి చిత్రం బ్లూ స్టార్. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన బ్లూ స్టార్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. అది కూడా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. ఫిబ్రవరి 29 నుంచి బ్లూ స్టార్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే అదే రోజే టెంట్ కొట్టా, సింప్లీ సౌత్ అనే మరో రెండు ఓటీటీల్లోనూ బ్లూ స్టార్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అయితే బ్లూ స్టార్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
బ్లూ స్టార్ సినిమాకు ఎస్. జయ కుమార్ దర్శకత్వం వహించారు. పృథ్వీ పాండిరాజన్, లిజీ ఆంటోనీ, శంతను భాగ్యరాజ్, అరుణ్ బాలాజీ, ఎలాంగో కుమారవేల్, భాగవతి పెరుమై తదితరులు కీలక పాత్రలు పోషించారు. లెమన్ లీఫ్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆర్. గణేణ్ మూర్తి, జీ. సౌందర్యతోపాటు నీలం ప్రొడక్షన్ పతాకంపై పా. రంజిత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సమకాలీన రాజకీయ అంశాలు, క్రికెట్ తో పాటు కులాల మధ్య అంతరాన్ని బ్లూ స్టార్ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి బ్లూ స్టార్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
#Bluestar Will Be Streaming On @SimplySouthApp & @Tentkotta From February 29 pic.twitter.com/JJqvQ8U7dZ
— Akshay 𓃵 (@Akshayk_2255) February 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.