- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannaah Bhatia Interesting Comments On Her Name Change And Numerology
Tamannaah Bhatia: తమన్నా పేరు మార్చుకోవడానికి కారణమేంటో తెలుసా? అసలు సీక్రెట్ బయట పెట్టిన మిల్కీ బ్యూటీ
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు ఫుల్ బిజిబిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమన్నా పేరు ఇది కాదట, కొన్ని కారణాలతో తన పేరును మార్చుకుందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ విషయం గురించి బయట పెట్టింది.
Updated on: Feb 25, 2024 | 6:06 PM

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు ఫుల్ బిజిబిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమన్నా పేరు ఇది కాదట, కొన్ని కారణాలతో తన పేరును మార్చుకుందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ విషయం గురించి బయట పెట్టింది.

తమన్నా సినిమా కెరీర్ ప్రారంభించి సుమారు 20 ఏళ్లు కావోస్తోంది. అయినా అప్పటికీ, ఇప్పటికీ మిల్కీ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు.

తమన్నా అంటే హిందీలో 'కోరిక' అని అర్థం. 8-9 ఏళ్ల వయసున్నప్పుడే హీరోయిన్ కావాలనుకుందంట ఈ ముద్దుగుమ్మ. అనుకున్నట్లుగానే టీనేజ్‌లోకి వచ్చేసరికి మోడలింగ్‌లో అడుగుపెట్టింది

యితే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడదామని అనుకున్నప్పుడు ఒకాయన తమన్నాను కలిశాడట. పేరులో మార్పు చేసుకోమని సూచించాడట.

ఇంగ్లిష్‌లో అదనంగా a,h జోడీంచుకోవాలని సలహా ఇచ్చాడు. అలా తన పేరు Tamannaah అయిందట. ఈ పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని, కెరీర్ పరంగానూ కలిసొచ్చిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.