Ambajipeta Marriage Band: OTTలో మోగనున్న అంబాజీ పూట మ్యారేజ్‌ బ్యాండ్.! ఎక్కడ , ఎప్పుడంటే.?

Ambajipeta Marriage Band: OTTలో మోగనున్న అంబాజీ పూట మ్యారేజ్‌ బ్యాండ్.! ఎక్కడ , ఎప్పుడంటే.?

Anil kumar poka

|

Updated on: Feb 25, 2024 | 1:06 PM

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి హిట్‌ కొట్టాడు సుహాస్. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో సాలిడ్ హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు. అలా ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మన ముందుకు వచ్చాడు సుహాస్‌. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన సూపర్‌ హిట్‌గా నిలిచింది.

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి హిట్‌ కొట్టాడు సుహాస్. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో సాలిడ్ హిట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు. అలా ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మన ముందుకు వచ్చాడు సుహాస్‌. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే హీరోగా సుహాస్ కు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక అప్ డేట్ ఇచ్చింది ఆహా. ‘మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి’ అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను త్వరలో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ ట్వీట్‌ చేసింది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొన్నటి వరకు మార్చి 8 న లేదా మార్చి 15న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తారని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 నుంచి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మోగనుంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన స్వరాలు సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. కుల వివక్ష కారణంగా అన్నా చెల్లెళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారది ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్‌. దీనికి చక్కటి ప్రేమకథను కూడా జోడించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..