TOP9 ET: గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేస్తుందోచ్ ! | ప్రభాస్ కాలు కదలికకే సోషల్ మీడియా షేక్.
కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చేతులు విసిగిపోయేలా కామెంట్ చేశారు. అడిగి అడిగి అసహనంతో ఊగిపోయారు. మొత్తానికి సాధించారు. ఎస్ ! గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ మూవీ టీజర్ వచ్చేస్తోందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుందట చరణ్స్ గేమ్ ఛేంజర్ మూవీ టీజర్. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో నుంచి బయటికి వచ్చి అక్రాస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
01.Ram charan
గుడ్ న్యూస్.. రామ్ చరణ్ టీజర్ వచ్చేస్తుందోచ్..!
కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చేతులు విసిగిపోయేలా కామెంట్ చేశారు. అడిగి అడిగి అసహనంతో ఊగిపోయారు. మొత్తానికి సాధించారు. ఎస్ ! గేమ్ ఛేంజర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ మూవీ టీజర్ వచ్చేస్తోందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుందట చరణ్స్ గేమ్ ఛేంజర్ మూవీ టీజర్. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో నుంచి బయటికి వచ్చి అక్రాస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యాన్స్ ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.
02.prabhas
ప్రభాస్ కాలు కదలికకే..
షేక్ అయిన సోషల్ మీడియా..
ప్రభాస్ కటౌటే కాదు.. ఆ కటౌట్‌లోని తన కాలు చిన్నగా కదిలినా సరే! సోషల్ మీడియా షేక్ అయిపోదు! ట్రెండింగ్‌లోకి ఆ కాలి కదలిక చేరిపోదు. ఇప్పుడు అదే జరిగింది. నాగ్ అశ్విన్ డైరోక్షన్లో ప్రభాస్ చేస్తున్న కల్కి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ మే9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ క్లారిటీ ఇస్తూనే ప్రభాస్ కాలు కదుపుతున్న ఓ వీడియోను షేర్ చేశారు. మరో సారి నెట్టింట కల్కి ట్రెండ్ అయ్యేలా చేశారు.
03.nani
వారంలో ఒక రోజు కోపం
దిమ్మతిరిగేలా ఉన్న టీజర్
కోపాలు రకరకాలు.. ఒక్కొక్కరికి కోసం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్దంగా.. పద్దతిగా.. వారంలో ఒక రోజు.. అది కూడా శనివారం మాత్రమే చూపించేస్తాడు ఈ హీరో. అతనే సూర్య అలియాస్ నాచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని చేస్తున్న ఈ మూవీనే సరిపోదా శనివారం. ఇక నాని బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ అయింది. అది ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూనే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
04.producer
హీరో నానిపై కవిత రాసిన ప్రొడ్యూసర్
అమ్మాయిని పొగడాలంటే కవిత ఉండాల్సిందే! ప్రేమలో పడేయాలంటే కవిత చెప్పాల్సిందే.! కానీ ఇదే కవితను హీరోపై వాడాడు ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి. నాని బర్త్ సందర్భంగా.. నానిపై ఓ కవిత రాశారు ఈయన. ఆ కవితనే తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నానిపై తనకున్న ఎనలేని గౌరవాన్ని చాటున్నారు. తనతో వర్క్ చేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు.
05.manchu manoj
తండ్రి కాబోతున్న మంచు మనోజ్
మంచు మనోజ్ తండ్రి కాబోతున్నారు. తాజాగా తన భార్య భూమా మౌనిక బేబీ బంప్‌తో ఫోటో షూట్ నిర్వహించారు. బ్లాక్ డ్రెస్‌లో తన భర్త మనోజ్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో కూడా షేర్ చేశారు మౌనిక. అయితే తన భార్య ఫోటోకు క్రేజీగా కామెట్ చేశారు మనోజ్. తన సినిమాలోని ఓపిల్ల సాంగ్ను కామెంట్గా ఆ ఫోటోల కింద కోట్ చేశారు.
06. niharika
ప్రేమపై నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రతీ ఒక్కొరికి కావాల్సింది ప్రేమే! అని నిహారిక పెట్టిన ఓ ఇన్‌స్టా స్టేటస్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మళ్లీ ఈ మెగా హీరోయిన్ ప్రేమలో పడిందా ఏంటనే? డౌట్ అందర్లో క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఇక ఇది పక్కకు పెడితే నిహారిక రీసెంట్గా తన భర్త చైతన్య కు విడాకులు ఇచ్చింది. ఎట్ ప్రజెంట్ సోలో లైఫ్ లీడ్ చేస్తూ… వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేసే పని మొదలుపెట్టింది.
07.samantha
బికినీలో ప్రకృతి పాఠాలు..
బామ ఒళ్లో కూర్చొని.. అ.. ఆ.. ఇ.. ఈ.. నేర్చుకోమని ఓ గ్రేట్ రైటర్ చెబితే.. కాదు కాదు.. ప్రకృతి ఒడిలో.. చల్లని నీటిలో..నిల్చొని… సేద తీరమని.. యూత్‌కు చెబుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అలా చేసే… ప్రకృతి ఒడిలో.. బికీలో… కొన్ని ఫోటోలను తీసుకుని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటోలో ప్రకృతిని మరింత అందంగా మార్చడమే కాదు.. ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతోంది ఈఈ బ్యూటీ.
08.nani
నానికి బర్త్‌డే గిఫ్ట్..
వేదికపై పాట పాడిన అల్లు అర్జున్
ఫిబ్రవరి 24 నాని బర్త్‌డే! నాని ఫ్యాన్స్ కు పండగ డే! అందుకే సోషల్ మీడియాలో నానికి సంబంధించిన క్రేజీ వీడియోలను వైరల్ చేస్తున్నారు న్యాచురల్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, నాని కలిసి ఓ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. వేదికపై పాటపాడుతున్న త్రో బ్యాక్ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. నానికి మరో సారి బర్త్ డే విషెస్ చెబుతూనే.. అల్లు అర్జున్ నాని కలిసున్న ఫోటోలను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
09.ram charan
‘అలా చూడగానే.. చరణ్‌తో ప్రేమలో పడ్డా..’
అమ్మాయిలు.. ఆంటీలు.. అమ్మమ్మలు మాత్రమే కాదు.. మిస్ ఇండియాలు.. మిస్ వలర్డ్‌లు… మిస్ యూనివర్స్‌లు.. కూడా రామ్ చరణ్ లుక్స్‌కు ఫిదా అవుతారు. పడిపోతారు. డై హార్డ్ ఫ్యాన్ గా మారుతారు. తాను కూడా.. చరణ్‌కు లుక్స్‌కు పడిపోయే అభిమానిగా మారా అని అంటున్నారు 2017 మిస్ వలర్డ్ కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్. చరణ్ బ్రదర్ వరుణ్ తేజ్‌తో ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తనకు చరణ్ అంటే పిచ్చి ప్రేమ అన్నారు. ట్రిపుల్ ఆర్ చూడగానే రామ్ చరణ్ తో ప్రేమలో పడిపోయా అని చెప్పారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..