ఆ హీరోని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నా.. సీరియల్ నటి సుజిత ఆసక్తికర కామెంట్స్
సుజీత 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో టీఎస్ మణి, రాధ దంపతులకు జన్మించింది. సుజీత ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ప్రముఖ చిత్రనిర్మాత ధనుష్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు చెన్నైలో నివసిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు .

సినిమాలతో పాటు సీరియల్స్ చాలా మంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చాలా మంది సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ గురింపు తెచ్చుకున్నారు నటి సుజిత. చూడటానికి అచ్చం మీరాజాస్మిన్ లా ఉంటుంది ఈ నటి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సుజిత చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ చిత్రం ఐదు భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ ఐదు భాషల్లోనూ ఆమె, బాబు ఆంటోనితో కలిసి నటించారని ఆమె తెలిపారు. ఇది తన జీవితంలో అత్యంత ఆనందాన్నిచ్చిన చిత్రమని సుజిత అన్నారు. పసివాడి ప్రాణం విజయం తర్వాత, అనేక మంది దర్శకులు అబ్బాయి పాత్రల కోసం సుజితనే ఎంపిక చేశారని తెలిపారు. హిందీలో హత్యా చిత్రంలో గోవిందాతో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలు ఆమెకు ఇంకా గుర్తున్నాయని, ఆ సమయంలో తన వయస్సు దాదాపు నాలుగైదు సంవత్సరాలే అని సుజిత గుర్తుచేసుకున్నారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
సుజిత తన బాల్యం నుండి దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ, టీవీ పరిశ్రమలలో కొనసాగుతున్నారు. జై చిరంజీవ చిత్రంలో చిరంజీవికి చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషించారని తెలిపారు. చిత్రీకరణ మొదటి రోజు, చిరంజీవిని చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు వచ్చాయని, చిరంజీవి ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పసివాడి ప్రాణంలో నటించిన తన చిన్ననాటి ఫోటోలు తన ఇంట్లో ఉన్నాయని చిరంజీవి చెప్పడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సుజిత గుర్తుచేసుకున్నారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించాలనే ఆసక్తి తనకు ఎప్పుడూ లేదని సుజిత స్పష్టం చేశారు. హీరోయిన్ స్థానం చాలా పెద్దదని, దానికి కావాల్సిన అంకితభావంవంటివి తాను తీసుకోలేదని చెప్పారు. సినీ పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని, దర్శకురాలిగా పని చేయాలనే కోరిక ఉందని ఆమె వెల్లడించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత దూరదర్శన్‌లో సీరియల్ అవకాశాలు రావడం, వాటితో బిజీ అవ్వడం జరిగిందని తెలిపారు. చివరిగా, సినిమా పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని, షూటింగ్‌లు చూడటాన్ని ఆనందిస్తానని అని చెప్పుకొచ్చారు.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




