AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: ‘బంగారం రా మా అన్న’.. లేడీ ఫ్యాన్స్‌ కోసం విజయ్ దేవర కొండ ఏం చేశాడో తెలుసా? వీడియో

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ ప్రస్తుతం కింగడమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. అయితే తన అభిమాన హీరో సూర్య పిలిచాడని ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు విజయ్.

Vijay Devarakonda: 'బంగారం రా మా అన్న'.. లేడీ ఫ్యాన్స్‌ కోసం విజయ్ దేవర కొండ ఏం చేశాడో తెలుసా? వీడియో
Vijay Deverakonda
Basha Shek
|

Updated on: Apr 28, 2025 | 1:20 PM

Share

లైగర్ ఫ్లాప్ తర్వాత  ఖుషి, ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం కింగ్ డమ్ అనే ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తన సినిమా షూటింగులో బిజీగా ఉంటోన్న విజయ్ దేవర కొండ ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరో సూర్యతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఇదే సినిమా ఈవెంట్ రౌడీ హీరో చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అతనికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అంతే. ఈ క్రమంలోనే రెట్రో ఈవెంట్‌కు వచ్చిన విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ రౌడీ హీరోతో ఫొటో తీసుకోవాలని ఆశపడ్డారు. అందుకు విజయ్ కూడా అంగీకరించాడు. దీంతో అతని దగ్గరకి ఫొటో తీసుకోవాలని చాలా మంది అమ్మాయిలు వెళ్లారు.

ఇదే క్రమంలో అక్కడ సోఫాలో నార్మల్‌గా కూర్చున్న విజయ్ తన కాళ్లు వాళ్లకి ఎక్కడ తగులుతుందో అని భావించి ముందే కాళ్లను పైకి పెట్టి కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన విజయ్ అభిమానులు, నెటిజన్లు తమ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గోల్డ్‌ రా మా అన్న’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక రెట్రో సినిమా విషయానికి వస్తే.. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తో విజయ్ దేవరకొండ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..