AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom Collections: దుమ్మురేపిన కింగ్‏డమ్ కలెక్షన్స్.. రికార్డ్స్ కొల్లగొట్టిన విజయ్..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 31న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

Kingdom Collections: దుమ్మురేపిన కింగ్‏డమ్ కలెక్షన్స్.. రికార్డ్స్ కొల్లగొట్టిన విజయ్..
Kingdom Collections
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2025 | 12:37 PM

Share

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా. ముఖ్యంగా ఇందులో విజయ్ మాస్ యాక్షన్..సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే అనిరుధ్ అందించిన బీజీఎమ్ హైలెట్ అయ్యింది. ఈ సినిమాకు మొదటి రోజే వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా కింగ్డమ్ ఫస్ట్ డే కలెకన్స్ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

కింగ్డమ్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.39 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అటు కేరళలలో కింగ్డమ్ మూవీ సత్తా చాటుతుంది. ఇప్పటివరకు కేరళలో హయ్యేస్ట్ ఓపెనింగ్ రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మొదటి రోజే కేరళలో రూ.50 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కేరళలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు హయ్యేస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా కింగ్డమ్ నిలిచింది.

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కింగ్డమ్ దూసుకుపోతుంది. తెలంగాణలో మొదటి రోజు రూ.6.72 కోట్లు.. ఏపీలో రూ.6.9 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..