AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: 35 ఏళ్లు వచ్చినా నేను సింగిల్ అంటే నమ్ముతారా.. బాంబ్ పేల్చిన రౌడీ..!

ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంటారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.

Vijay Devarakonda: 35 ఏళ్లు వచ్చినా నేను సింగిల్ అంటే నమ్ముతారా.. బాంబ్ పేల్చిన రౌడీ..!
Vijay Devarakonda
Praveen Vadla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 21, 2024 | 8:22 PM

Share

ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంటారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ అందరికంటే ముందుంటాడు. ఎందుకంటే ఈయన బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం అయింది. అయినా కూడా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఇంకా చెప్పాలంటే పెరుగుతూనే ఉంది. దానికి కారణం సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్. సినిమాలతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. అందుకే చాలామంది నిర్మాతలు చిన్న సినిమాల కోసం విజయ్ క్రేజ్ వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

సారంగపాణి జాతకం సినిమా టీజర్ విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన పర్సనల్ లైఫ్ గురించి చాలా రోజులుగా ఉన్న అనుమానాలకు తెర దించేశాడు విజయ్. ఈయన సింగిలా లేదంటే మింగిల్ అయిపోయాడా అని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఒక హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడంటూ చాలా సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

ఆ హీరోయిన్ ఎవరో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా సదరు హీరోయిన్ విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనే వార్తలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ చూసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. కొత్త కొత్త అనుమానాలకు తెర తీస్తున్నాయి. ఇప్పుడు నా వయసు 35.. ఇప్పటికీ కూడా నేను సింగిల్ అంటే మీరు నమ్ముతారా అంటూ విజయ్ చేసిన కామెంట్స్‌తో ఆయన కచ్చితంగా ప్రేమలో ఉన్నాడనే విషయం అర్థం అయిపోతుంది. మనోడి తీరు చూస్తుంటే త్వరలోనే పప్పన్నం పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

తన సింగిల్ కాదు అనే విషయాన్ని చెప్పాడు కానీ.. ఎవరితో మింగిల్ అయ్యాను అనే విషయం మాత్రం విజయ్ దేవరకొండ ఓపెన్ కాలేదు. త్వరలోనే ఈ విషయం కూడా బయటికి చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ చాలా బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్నానూరి సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత రవి కిరణ్ కోలా, రాహుల్ సంక్రిత్యన్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఆ తర్వాత కూడా మరో రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్‌లో ఫుల్ క్లారిటీతో అలా దూసుకుపోతున్నాడు రౌడీ బాయ్.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి