- Telugu News Photo Gallery Cinema photos Hero Nani announced Another movie with Mollywood director Vipin Das, Details Here
Nani: మరో మూవీ ఎనౌన్స్ చేసిన నాని.! లైన్లో 5 సినిమాలు..
పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే.. నేషనల్ లెవల్‌లో ప్రూవ్ చేసుకున్న నాని మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ మిగతా హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ మూడు సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్, ఇప్పుడు మరో మూవీని లైన్‌లో పెడుతున్నారు.
Updated on: Nov 21, 2024 | 7:20 PM

పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే.. నేషనల్ లెవల్‌లో ప్రూవ్ చేసుకున్న నాని మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు.

వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ మిగతా హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ మూడు సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్, ఇప్పుడు మరో మూవీని లైన్‌లో పెడుతున్నారు.

సరిపోదా శనివారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాని, ప్రజెంట్ హిట్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో గత రెండు చిత్రాలకు కేవలం నిర్మాతగానే వ్యవహరించిన నేచురల్ స్టార్ త్రీక్వెల్‌లో హీరోగానూ నటిస్తున్నారు.

హిట్ 3 సెట్స్ మీద ఉండగానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ మూవీని ఎనౌన్స్ చేశారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమాతోనే తొలి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నాని.

అందుకే మరోసారి అదే కాంబోను రిపీట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నారు.

ప్రజెంట్ పవన్ ఓజీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుజిత్, నెక్ట్స్ నానితో కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్న నాని,

తాజాగా ఓ మలయాళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మాలీవుడ్‌లో జయ జయ జయ హే,

గురువాయూర్ అంబలనడయిల్ లాంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన విపిన్ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.అయితే ఈ సినిమా 2026లోపు సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపించటం లేదు.




