Film Publicity: ప్యాన్ ఇండియా ఆడియన్స్ కోసం కొత్త వ్యూహాలు.. ఈవెంట్స్‌తో మార్క్..
సినిమా రిలీజ్‌కి ముందు ప్యాన్ ఇండియా ఆడియన్స్ అటెన్షన్ అందుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారివి. కొందరు కూర్చున్న చోటే పావులు కదుపుతుంటారు. మరికొందరు గ్రౌండ్‌లోకి దిగి మరీ ప్రచారం చేసుకుంటుంటారు. ఈ కాంపిటిటివ్ వరల్డ్ లో ఫలానా ప్లానే వర్కవుట్ అవుతుందని చెప్పడానికి లేదు. వర్కవుట్ అయితే అయిందనుకోవాలి.. లేకుంటే ప్లాన్ బీ వైపు చూసుకోవాలి. అంతే కదా.. ఏమంటారు.?
Updated on: Nov 22, 2024 | 1:20 PM

ఎంత కంటెంట్ ఉంటే అంత పబ్లిసిటీ చేయాలన్నది రాజమౌళి నమ్మే ఫార్ములా. అందుకే మెయిన్ సిటీస్‌ని మార్క్ చేసి మరీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. మూవీ యూనిట్ మొత్తం ఉండేలా ముందు నుంచే కాల్షీట్లు అడ్జస్ట్ చేసుకుంటారు.

మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది కానీ.. పైసా తగ్గదు అనే మాటను చాలా సార్లు సినిమాల ప్రమోషన్లలో వింటూనే ఉంటాం.

రీసెంట్‌గా పాట్నాలో కనీవినీ ఎరుగని రీతిలో ఈవెంట్ చేసిన బన్నీ... త్వరలోనే హూబ్లీలో మరో ఈవెంట్‌కి హాజరు కానున్నారు. అందరూ బెంగుళూరుకే పరిమితమైతే, ఓ స్టెప్ ముందుకేసి హూబ్లీ ఆడియన్స్ ని టచ్ చేయాలనే బన్నీ ప్లాన్ అదుర్స్ అని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.

సమయం వచ్చింది కాబట్టి.. పబ్లిసిటీ విషయంలో ప్రభాస్ ఫాలో అవుతున్న రూట్‌మ్యాప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పబ్లిక్ అప్పియరెన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ప్రభాస్. మిగిలిన టీమ్‌తో పబ్లిసిటీ కానిచ్చేసి, ఒకటీ అరా ఫంక్షన్లకు మాత్రం హాజరవుతున్నారు.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో మిగిలిన హీరోలందరూ గ్రౌండ్‌లోకి దూకి మరీ పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ టైమ్‌లో ప్రభాస్ తన ఆలోచనను మార్చుకుంటారా? లేకుంటే తన దారిలోనే ట్రావెల్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ...




