- Telugu News Photo Gallery Cinema photos Naga chaitanya sai pallavi thandel movie song will be released on November 24, details here
Thandel: బుజ్జితల్లి కోసం దేవిశ్రీ ఏం చేశారు.! తండేల్ మ్యూజిక్ స్టార్ట్..
వరుస అప్‌డేట్లతో హోరెత్తుతోంది టాలీవుడ్. కిస్సిక్ పాటను ఈ నెల 24న రిలీజ్ చేస్తామని చెప్పేసింది పుష్ప2 టీమ్. అటు రామ్ సినిమా ఓపెనింగ్ జరిగింది. ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్ చేసుకున్నారు.. బుజ్జితల్లీ అంటూ తండేల్ యూనిట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేసింది.. నాగచైతన్య - సాయిపల్లవి కీలక పాత్రల్లో నటించిన సినిమా తండేల్. ఈ సినిమా నుంచి బుజ్జితల్లి పాటను విడుదల చేశారు.
Updated on: Nov 22, 2024 | 1:52 PM

సిసలైన సినిమా సండది షురూ కావాలంటే సరిగమలతో స్టార్ట్ చేయడం బెస్ట్. అందుకే బుజ్జితల్లీ.. వచ్చేత్తున్నాను కదే.. అంటూ ఫస్ట్ సింగిల్‌ని అనౌన్స్ చేశారు తండేల్ మేకర్స్.

దేవిశ్రీ ప్రసాద్ చేసిన తండేల్ మ్యాజిక్ ఎలా ఉండబోతోంది.? వేలంటైన్స్ వీక్‌కి కాస్త ముందుగానే రిలీజ్‌కి రెడీ అవుతోంది తండేల్ మూవీ.

ఆల్రెడీ లవ్‌స్టోరీతో ఫిదా చేసిన చైతూ - పల్లవి జంట, మరోసారి మేజిక్ చేయడానికి మేం రెడీ అంటున్నారు.

మీరందరూ సిద్ధమంటే.. నేను వెనకడుగేస్తానా.. అంటూ రెస్పాండ్ అవుతున్నారు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ బాణీలను, జావేద్ అలీ స్వరంలో వింటే..

అదో అద్భుతమైన ఫీలింగ్ అంటారా? యస్.. తండేల్‌లోనూ మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు వీరిద్దరూ.

తండేల్ మ్యూజిక్‌ని సగర్వంగా సమర్పించేస్తున్నాం అంటోంది ఆదిత్య మ్యూజిక్. మంచి ప్రేమకథకి, పర్ఫెక్ట్ ఎమోషన్ తోడైతే..

సినిమా చేసే సౌండ్ ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తండేల్‌తోనూ అలాంటి బ్లాక్‌బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

గురువారం రిలీజ్ అయ్యే బుజ్జితల్లి సాంగ్.. చార్ట్ బస్టర్ అయి తీరుతుందనే మాట ఇష్టంగా వినిపిస్తోంది మ్యూజిక్ సర్కిల్స్ లో.




