AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒక్కరోజు అలా బయట తిన్నారంటే.. ఇక డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ అయినట్టే..

జీహెచ్ఎంసీ హెల్త్ సైరన్ మోగించింది. హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. పటాన్ చెరులో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

Hyderabad: ఒక్కరోజు అలా బయట తిన్నారంటే.. ఇక డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ అయినట్టే..
Ghmc Food Saftey Raids
Ravi Kiran
|

Updated on: Nov 19, 2024 | 11:00 AM

Share

కల్తీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. సర్కార్ సీరియస్ వార్నింగ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొదలైన ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఎంజీ రోడ్డులో జీహెచ్ఎంసీ శాఖ తరపున ఫుడ్ సేప్టీ జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు‌ చేపట్టారు.

వీధి పక్కన ఉన్న పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపులు తనిఖీ చేశారు. ఫుడ్‌ సేఫ్టీ దాడుల్లో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న జ్యూస్‌ సెంటర్‌లో తనిఖీ చేసి… జ్యూస్‌లో మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వాడకంతో ప్రాణాలకే ప్రమాదమని తెలిసి కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. మరోవైపు పలు హోటల్స్‌లో తనిఖీలు చేశారు. వంటలో వినియోగించే పదార్ధాల శాంపిక్స్‌ సేకరించారు.

కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన పదార్ధాలను సీజ్‌ చేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగు నీరు పేరుకుపోయినట్లు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొన్ని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో వాడే నూనె సరిగ్గా లేకపోవడంతో రూ 5 వేల జరిమానా విధించారు. మరి కొన్ని ఫుడ్‌ సెంటర్స్‌లో తనిఖీ చేసి అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. త్వరలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని… అప్పుడు కూడా తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మొత్తంగా హోటల్స్‌లో జరుగుతున్న వాస్తవి పరిస్థితిని ప్రజల కళ్లకు కనబడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..