TGPSC Group 3 Result Date: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు 50 శాతం డుమ్మా..! రిజల్ట్స్‌ ఎప్పుడంటే..

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలకు భారీగా అభ్యర్ధులు గైర్హాజరయ్యారు. హాల్ టికెట్లను 75 శాతం మంది డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ పరీక్షలకు మాత్రం 50 శాతానికి మించి హాజరు నమోదు కాకపోవడం గమనార్హం..

TGPSC Group 3 Result Date: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు 50 శాతం డుమ్మా..! రిజల్ట్స్‌ ఎప్పుడంటే..
TGPSC Group 3 Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 19, 2024 | 3:35 PM

హైదరాబాద్‌, నవంబరు 19: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2 రోజులపాటు నిర్వహించిన గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1,365 గ్రూప్‌ 3 సర్వీసు పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,401 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,400 మంది అభ్యర్ధులు గ్రూప్ 3కి దరఖాస్తు చేయగా.. వారిలో సగం మంది మాత్రమే పరీక్షలకు హాజరుకావడం చర్చణీయాంశంగా మారింది. పేపర్‌ 1 పరీక్షకు 2,73,847 మంది (51.1 శాతం), పేపర్‌ 2 పరీక్షకు 2,72,173 మంది (50.7 శాతం) హాజరయ్యారు. మొత్తంగా తొలిరోజు 50.7 శాతం మంది పరీక్షలు రాశారు. ఇక నవంబరు 28న జరిగిన మూడో పేపర్‌కు సైతం 50.24 శాతం మందే హాజరుకావడం గమనార్హం. అంటే చివరి పరీక్ష 2,69,483 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు టీజీపీఎస్‌సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఓప్రకటనలో తెలిపారు. మొత్తానికి సగం మంది మాత్రమే గ్రూప్‌3 పరీక్ష రాశారని స్పష్టమవుతోంది.

కాగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఏకంగా 50 శాతం అభ్యర్థులు డుమ్మాకొట్టినట్లు తెలుస్తుంది. గ్రూప్‌-3 పరీక్షకు సంబదంధించిన హాల్‌ టికెట్లను 76 శాతం అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ పరీక్షకు భారీ మొత్తంలో అభ్యర్ధులు హాజరుకాకపోవడం వెనుక ఇంకా తెలియరాలేదు. జిల్లాలవారీగా చూస్తే.. అత్యధికంగా న‌ల్లగొండ జిల్లాలో 71.30 శాతం మంది హాజ‌రు కాగా, ఆ తర్వాత స్థానాల్లో సూర్యాపేటలో 66.91 శాతం, మహబూబ్‌నగర్‌లో 63.58 శాతం అభ్యర్థులు రాశారు. అత్యల్పంగా వ‌రంగ‌ల్ జిల్లాలో 49.93 శాతం మంది హాజ‌ర‌య్యారు. ఇక గ్రూప్‌ 3 ఫలితాలు డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం.

అయితే మూడు పేపర్లలో ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్తంగా ఉన్నట్టు అభ్యర్ధులు చెబుతున్నారు. గణాంకాలను గుర్తుంచుకున్న వారికి కాస్త మెరుగ్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల కాన్సెప్ట్‌ తరహాలో ప్రశ్నలొచ్చినట్టు పలువురు పేర్కొన్నారు. సుధీర్ఘకాలంగా ప్రిపేర్‌ అవుతున్నవారు ప్రయోజనం పొందే ఛాన్స్‌ ఉంది. ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పేపర్‌లో హైడ్రా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలు అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.