Hyderabad: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తాను ఉదయాన్నే రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా.. అతడికి ఓ నల్లటి బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా..
మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తాను ఉదయాన్నే రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా.. అతడికి ఓ నల్లటి బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా.. ఒక్కసారిగా కళ్లు జిగేల్ అనిపించాయి. ఇంతకీ ఆ వివరాలు ఇలా.. హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన సతీష్ యాదవ్ అనే వ్యక్తికి ఉదయం లాలాపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై రెండు లక్షల రూపాయలు కనబడ్డాయి. వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్‌కు సమాచారం అందజేసి ఆయన సహాయంతో లాలాగూడ పోలీసులను సంప్రదించి సదరు రెండు లక్షల రూపాయలు పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు సతీష్ యాదవ్, కిషోర్ యాదవ్‌లను అభినందించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

