AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4.. కొత్త ఎయిర్‌పోర్టులు ఎక్కడెక్కడో తెల్సా

గతంలో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లపై ఫోకస్‌ పెట్టిన తెలుగు రాష్ట్రాలు..ఇప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులపై ఫోకస్‌ పెట్టాయి. అటు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన రామ్మోహన్‌నాయుడే ఉండడంతో..ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి.

గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4.. కొత్త ఎయిర్‌పోర్టులు ఎక్కడెక్కడో తెల్సా
Airport
Ravi Kiran
|

Updated on: Nov 19, 2024 | 9:00 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో కొత్త రెక్కలు విచ్చుకోనున్నాయి. ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీలోని ఆరు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజిబిలిటీ స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం నుండి కూడా సానుకూల స్పందన రావడంతో..ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఇక తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో పాటు బేగంపేట ఎయిర్‌పోర్టు మాత్రమే ఉంది. వీటికి అదనంగా రామగుండం, మామునూరు, కొత్తగూడెంలో కొత్తగా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది..రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. మామునూరు ఎయిర్ పోర్టుకు ఇప్పటికే ఎన్‌ఓసీ సాధించామని..దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయాన్ని 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.

డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలుస్తామన్నారు..కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లాలోని మామునూరులో ఎయిర్‌పోర్ట్‌..స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉంది. దాదాపు 32 ఏళ్ల కిందట ఇది మూతపడింది. దీన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో..మామునూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి. దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది. అటు వరంగల్‌ అభివృద్ధికి కూడా మామునూరు ఎయిర్‌పోర్టు కీలకం కానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల