Venky Atluri : బాలయ్య బాబును డైరెక్ట్ చేయనున్న కుర్ర దర్శకుడు.. యాక్షన్ స్టోరీ రెడీ చేస్తునం వెంకీ..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరో నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకీ అట్లూరి.

Venky Atluri : బాలయ్య బాబును డైరెక్ట్ చేయనున్న కుర్ర దర్శకుడు.. యాక్షన్ స్టోరీ రెడీ చేస్తునం వెంకీ..
Venky Atluri
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2021 | 7:28 AM

Venky Atluri :

మెగా హీరో వరుణ్ తేజ్ హీరో నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ ,ఆతర్వాత అఖిల్ అక్కినేని తో సినిమా చేసాడు. మిస్టర్ మజ్ను అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ.. నితిన్ తో రంగ్ దే సినిమా చేసాడు.కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సన్తం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ ఓ సీనియర్ హీరోతో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. వెంకీ అట్లూరి ఈ సారి యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ ఓకే చెప్పారట. దాంతో వారు వెంకీ అట్లూరితో కథను సిద్ధం చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒక వేళా ఈ వార్త  నిజమైతే ఈ కుర్ర దర్శకుడి సుడి తిరిగినట్టే.. బోయపాటి సినిమా తరువాత బాలయ్యతో సినిమాలు చేయడానికి గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి .. శ్రీవాస్ లైన్లో ఉన్నారు. ఆ తరువాతనే వెంకీ అట్లూరి వంతు రానుంది. ఇక బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ సినిమా కోసం బాలయ్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ సినిమా పై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ఏపీ, తెలంగాణ ఎక్కడినుంచైనా సరే.. సంచలన కామెంట్లు చేసిన వంటలక్క

Mahesh Babu: తన గారాలపట్టీల ప్రేమగా హత్తుకుని హాయిగా నిద్రిస్తున్న సూపర్ స్టార్.. వైరల్ గా మారిన మహేష్ బాబు సితార ఫోటో…

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!