బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు అనుకోని నష్టం.. వర్షం కారణంగా దెబ్బతిన్న భారీ సెట్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెడుస్తున విషయం తెలిసిందే. తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాతో హీరోగా..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెడుస్తున విషయం తెలిసిందే. తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ నటించింది. ఇక ఈ సినిమాతర్వాత వరుసగా సినిమాలు చేసాడు బెల్లంకొండ. అయితే తెలుగులో బెల్లం కొండకు సరైన హిట్ దక్కలేదు. రిమ్స్ వర్మ తెరకెక్కించిన తమిళ్ రీమేక్ రాక్షసుడు సినిమా తప్ప మరో హిట్ లేదు ఈ హీరో ఖాతాలో. దాంతో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరిషనిచుకోవడానికి బయలుదేరాడు ఈ యంగ్ హీరో. రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నాడు. దీనికి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.
రాజమౌళి తండ్రి ‘ఛత్రపతి’ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.ఈ సినిమాకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్ల వ్యయంతో ఓ భారీ విలేజ్ సెట్ కూడా నిర్మించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం – లాక్ డౌన్ కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోగా వర్షాల రూపంలో దురదృష్టం వెంటాడింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ‘ఛత్రపతి’ సెట్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సెట్ కు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు తెలియలేదు.
మరిన్ని ఇక్కడ చదవండి :