Viral Video: ప్రేమించిన యువతి కోసం కొత్త పెళ్లికూతురు గెటప్‌లో వెళ్లాడు.. ఈలోగా షాకింగ్ ట్విస్ట్
Viral Video: ప్రేమ కోసం చాలా మంది అనేక కష్టాలు పడుతుంటారు. ప్రేమలో పడ్డవారు ఒకరికొకరు దూరంగా ఉండాలంటే నరకంగా భావిస్తారు. ప్రేమ కోసం..
ప్రేమ కోసం చాలా మంది అనేక కష్టాలు పడుతుంటారు. ప్రేమలో పడ్డవారు ఒకరికొకరు దూరంగా ఉండాలంటే నరకంగా భావిస్తారు. ప్రేమ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. ఇక్కడ మాత్రం ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెరైటీ ప్లాన్ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లాకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. కానీ, విషయం అమ్మాయి ఇంట్లో వారికి తెలియటంతో వీరిని దూరంగా పెట్టారు. దీంతో సదరు ప్రేమికుడు ప్రియురాలికి దూరంగా ఉండలేకపోయాడు. ఎలాగైనా తన ప్రేయసిని కలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా పెళ్లి కూతురు గెటప్ వేసుకుని తన లవర్ ఇంటికి చేరుకున్నాడు. అయితే, నవ వధువు వేషంలో వచ్చిన యువకుడిని చూసిన అమ్మాయి తండ్రి, బంధువులు కాసింత షాకయ్యారు. కొత్త పెళ్లి కూతురు తన కూతురి కోసం రావటంతో కాస్త అనుమానంతో ముఖం మీద ముసుగు తీయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ యువకుడి గుట్టు రట్టయింది.
యువతి తండ్రి, బంధువులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసేలోగానే… అప్రమత్తమైన యువకుడు ఫ్రెండ్ బైక్ ఎక్కి వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో విషయం కాస్తా వైరల్‌గా మారింది.
यूपी के भदोही जिले में एक युवक दुल्हन बनकर अपनी प्रेमिका से मिलने उसके घर पहुंच गया। pic.twitter.com/kYynJobHCY
— NBT Hindi News (@NavbharatTimes) June 2, 2021
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?