Petrol Diesel Price Today: కొన్ని చోట్ల కొద్దిగా తగ్గిన పెట్రోల్ ధర.. ఎంతో తెలుసా..!
Petrol Diesel Price Today:
Petrol-Diesel Rates Today: ఏపీలో పెట్రోల్ ధర మంట కొనాసాగుతోంది. రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వణుకుపుట్టిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 93.38గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.63గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.93.50గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 98.54గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.41గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.58గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.47గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48ఉండగా.. డీజిల్ ధర రూ.93.38 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.03పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.55గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.89 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.15 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 99.90ఉండగా.. డీజిల్ ధర రూ.94.23గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.04లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.36 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.70 గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.02గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 100.89లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.95.19లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 94.79గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 85.66 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.99 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.94.76 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 88.51 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 96.23ఉండగా.. డీజిల్ ధర రూ.90.38గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.97.64 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.90.81 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.91 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.05గా ఉంది.