Mahesh Babu: తన గారాలపట్టీల ప్రేమగా హత్తుకుని హాయిగా నిద్రిస్తున్న సూపర్ స్టార్.. వైరల్ గా మారిన మహేష్ బాబు సితార ఫోటో…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీకి కావాల్సినంత టైం కేటాయిస్తూ ఉంటారు. షూటిగ్ కు గ్యాప్ దొరికితే భార్య పిల్లలతో కలిసి
Mahesh Babu:
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీకి కావాల్సినంత టైం కేటాయిస్తూ ఉంటారు. షూటిగ్ కు గ్యాప్ దొరికితే భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లి ఆనందంగా గడుపుతుంటారు మహేష్. ఇక మహేష్ కుటుంబసభ్యులతో గడిపే మధురమైన క్షణాలను ఫోటోలు వీడియోల రూపంలో ఆయన భార్య నమృత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా సెకండ్ వేవ్ ప్రభావంతో మహేష్ ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. దుబాయ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు చిత్రయూనిట్. దాంతో ఇంట్లో తన గారాలపట్టీలతో మధురమైన క్షణాల్ని ఆస్వాధిస్తున్నారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టరు మహేష్.
సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టీ సితార ఘట్టమనేని మహేష్ ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను షేర్ చేసారు నమృత. మహేష్ కూడా తన గారాలబేబీని ప్రేమగా హత్తుకుని హాయిగా నిదురిస్తున్నారు. ఈ ఫోటోని ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన నమ్రత .. వేకువ ఝామున బేబీని అలా కౌగిలించుకుని నిదురపోవడం మస్ట్.. అలా చేయకపోతే ఉదయమే నిదుర లేవలేం అంటూ రాసుకొచ్చారు నమృత.
View this post on Instagram