R. Madhavan : మరోసారి విలన్ గా మాధవన్.. ఎనర్జిటిక్ హీరో సినిమాలో నటించనున్న మ్యాడీ..
ఆర్ మాధవన్.. సినిమా లవర్స్ కు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లవర్ బాయ్ గా సౌత్ ఇండియన్ సినిమాల్లో మాధవన్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
R. Madhavan :
ఆర్ మాధవన్.. సినిమా లవర్స్ కు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లవర్ బాయ్ గా సౌత్ ఇండియన్ సినిమాల్లో మాధవన్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నడిచిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. హీరోగా రాణించిన మాధవన్ ఇప్పుడు విలన్ గాను మెప్పిస్తున్నారు. తెలుగులో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్ గా నటించి మెప్పించారు. సినిమా విజయం సాదించనప్పటికీ విలన్ గా మాధవన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత ఇటీవల అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు మాధవన్. తాజాగా మరో యంగ్ హీరోకు విలన్ గా నటించబోతున్నాడని తెలిస్తుంది. త్వరలోనే మాధవన్ ఊరమాస్ విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు టాక్.
ఎనర్జిటిక్ హీరో రామ్ తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మాస్ యాక్షన్ కథాంశంతో రాబోతుంది. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసుకొని షూటింగ్ కు సిద్ధం అయ్యారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మాధవన్ విలన్ రోల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై క్లారిటీ రాలేదు. ఒకవేళ మాధవన్ విలన్ రోల్ ఓకే అయితే మాత్రం సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఏ ఈసినిమాలో రామ్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :