AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వేలాది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కోట్ల మనసులను గెలుచుకున్న గాత్రం ఆయనది..  పాటకు ప్రాణం ఆయన స్వరం. ఆయనే గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వేలాది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 04, 2021 | 11:10 AM

Share

sp balasubrahmanyam : కోట్ల మనసులను గెలుచుకున్న గాత్రం ఆయనది.. పాటకు ప్రాణం ఆయన స్వరం. ఆయనే గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..ముద్దుగా అందరు బాలు గారు అంటూ పిలుచుకుంటారు. నేడు ఆ గానగంధర్వుడు పుట్టిన రోజు.  తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోశారు బాలు. ఆ నాటి హీరోలనుంచి నేటి తరం హీరోల బాలు పాట వినిపించింది. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా మొదలైన బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ఎందరికో ఆదర్శం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలను ఆలపించారు బాలు. చాలామంది హీరోలకు వారి స్టైల్ లోనే వారి గొంతును మిమిక్రీ చేస్తూ పాటలు పాడారు బాలు. సింగర్ గానే కాదు నటుడిగా ను ఆయన తన ప్రతిభను కనబరిచారు.

అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు బాలు. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు. దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25 న సంగీత ప్రియులను నిశీధిలోకి నెట్టి ఆయన స్వర్గస్థులయ్యారు. కరోనా వైరస్ సూకడంతో చికిత్స పొందుతూ బాలు కనుమూశారు. మరణం తర్వాత 2021లో  కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ఏపీ, తెలంగాణ ఎక్కడినుంచైనా సరే.. సంచలన కామెంట్లు చేసిన వంటలక్క

Mahesh Babu: తన గారాలపట్టీల ప్రేమగా హత్తుకుని హాయిగా నిద్రిస్తున్న సూపర్ స్టార్.. వైరల్ గా మారిన మహేష్ బాబు సితార ఫోటో…